సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ రిలీజ్ డేట్ ఫిక్స్... పరిణితి చోప్రా ప్రధాన పాత్రలో...

Published : Mar 02, 2021, 12:00 PM IST
సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ రిలీజ్ డేట్ ఫిక్స్... పరిణితి చోప్రా ప్రధాన పాత్రలో...

సారాంశం

‘సైనా’ పేరుతో రూపొందుతున్న సైనా నెహ్వాల్ బయోపిక్... సైనా నెహ్వాల్ పాత్రలో మెరవనున్న పరిణితీ చోప్రా... మార్చి 26న థియేటర్లలో సైనా బయోపిక్...

భారత బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ ఓ సంచలనం. సైనా నెహ్వాల్ కంటే ముందు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప వంటి ఎందరో ప్లేయర్లు ఉన్నా, సైనా నెహ్వాల్ సాధించిన అద్భుత విజయాలు భారత బ్యాడ్మింటన్‌ను జనాల్లోకి తీసుకెళ్లాయి.

సైనా స్ఫూర్తితోనే ఎందరో యువ క్రీడాకారులు రాకెట్ పట్టుకున్నారు. సైనా నెహ్వాల్ జీవితకథ ఆధారంగా బాలీవుడ్‌లో బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘సైనా’ పేరుతో రూపొందుతున్న సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా, సైనా నెహ్వాల్ పాత్రలో కనిపించబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. అమోల్ గుప్తే డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సైనా’ మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది. ‘మార్ దుంగీ’ అనే కాప్షన్‌తో వస్తున్న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !