ఆ ఇద్దరు భారత అథ్లెట్లపై వేటు పడింది

First Published Apr 13, 2018, 1:43 PM IST
Highlights
ఆ ఇద్దరు భారత అథ్లెట్లపై వేటు పడింది

కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి ఇద్దరు భారత అథ్లెట్లు సస్పెన్షన్‌ అయ్యారు. ‘నో నీడిల్స్‌’ పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను భారత అథ్లెట్లు రాకేశ్‌ బాబు, ఇర్ఫాన్‌ కోలోథమ్‌ థోడిపై కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్(సీజీఎఫ్‌)‌ చర్యలు తీసుకుంది. వారిని వెంటనే గోల్డ్‌కోస్ట్‌ వదిలి స్వదేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశించింది.

ఈ ఇద్దరి అథ్లెట్ల గదిలో నీడిల్‌ దొరకడంతో ఫెడరేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.  ‘నో నీడిల్స్‌‌’ పాలసీని వీరు ఉల్లంఘించారు. దీంతో గేమ్స్‌లో పాల్గొనకుండా సస్పెండ్‌ చేస్తున్నాం. వారి అక్రిడిటేషన్‌ను కూడా రద్దు చేశాం. క్రీడా గ్రామం నుంచి కూడా పంపించి వేశాం..అని సీజీఎఫ్‌ అధ్యక్షుడు లూయిన్‌ మార్టిన్‌ వెల్లడించారు. 

click me!