అదరగొట్టిన దీపికా కుమారి... ఆర్చరీ ప్రపంచకప్‌లో మూడు స్వర్ణాల‌తో...

Published : Jun 28, 2021, 03:02 PM IST
అదరగొట్టిన దీపికా కుమారి... ఆర్చరీ ప్రపంచకప్‌లో మూడు స్వర్ణాల‌తో...

సారాంశం

మహిళల రికర్వ్ టీమ్, మిక్స్‌డ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గిన దీపికా కుమారి... పారిస్‌లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్‌కప్‌లో భారత ఆర్చర్ల అద్భుత ప్రదర్శన...

ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి, అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. మహిళల రికర్వ్ టీమ్, మిక్స్‌డ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గిన దీపికా కుమారి, హ్యాట్రిక్ సాధించింది.

దీపికా కుమారితో పాటు అంకిత భకత్, కోమలిక బారి ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వ్యక్తిగత విభాగంలో దీపికా, రష్యన్ ఆర్చర్ ఒసిపోవాను ఓడించి గోల్డ్ మెడల్ సాధించగా... మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అతాను దాస్‌తో కలిసి స్వర్ణం సాధించింది.

అతాను దాస్, దీపికా కుమారి భర్తే. వీరిద్దరూ గత ఏడాది జూన్ 30నే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు... హ్యాట్రిక్ పతకాలు సాధించిన దీపికా కుమారి, వరల్డ్ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లింది...


 

PREV
click me!

Recommended Stories

ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?
తెలుగోడా.. మజాకానా.! టీ20ల్లో తోపు బ్యాటర్‌గా.. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేశాడుగా