అక్లాండ్ టీ20: రాణించిన బౌలర్లు...టీంఇండియా సునాయాస విజయం

By sivanagaprasad KodatiFirst Published Feb 8, 2019, 11:44 AM IST
Highlights

అక్లాండ్ టీ20లో కివీస్ భారత్ ముందు 159 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలుత టీమిండియా బౌలర్ల ధాటికి ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ రాస్ టేలర్, గ్రాండ్ హోమ్మీలు ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు

మూడు టీ20 మ్యాచ్‌ల సీరిస్‌లో భాగంగా జరిగిన రెండో టీ20లో టీంఇండియా సునాయాస విజయాన్ని కైవసం చేసుకుంది. భారత బౌలర్లు కృనాల్ పాండ్యా, ఖలీల్ అహ్మద్ రాణించడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కివీస్ ను కేవలం 158 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ కూడా రాణించడంతో టీంఇండియ ా ఘన విజయాన్ని సాధించింది. 

వెల్లింగ్టన్ లో జరిగిన మొదటి టీ20లో ఘోర పరాభవాన్ని చవిచూసిన భారత్ 0-1తో వెనుకబడిపోయిన విషయం తెలిసిందే. అయితే టీ20 సీరిస్ భారత్ ఆశలు పెట్టుకోవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో టీంఇండియా సమిష్టిగా రాణించి విజయం సాధించిది. దీంతో భారత్ 1-1  సీరిస్ సమం చేసింది. దీంతో టీ20 సీరిస్ విజయాన్ని మూడో టీ20 నిర్ణయించనుంది.

భారత బౌలర్లలో కృనాల్ పాండ్యా 3, ఖలీల్ అహ్మద్ 2, హర్దిక్ పాండ్యా 2, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ పడగొట్టాడు. ఆ  తర్వాత బ్యాటింగ్ లో రోహిత్ శర్మ 50. శిఖర్ ధావన్ 30, రిషబ్ పంత్ 40, విజయ్ శంకర్ 14. ధోని 20 పరుగులు చేసి టీంఇండియా విజయ తీరాలకు చేర్చారు. 

లక్ష్యచేధనకు చేరువైన క్రమంలో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. 118 పరుగుల వద్ద విజయ్ శంకర్ మూడో వికెట్ రూపంలో పెవిలియన్ బాట పట్టాడు.

159 పరుగుల స్వల్ఫ  లక్ష్యచేధనతో బరిలోకి దిగిన టీంఇండియా సెంచరీ సాధించింది. ఓపెనర్లు రోహిత్, ధావన్ లు చెలరేగి ఆడటంతో కేవలం 12 ఓవర్లలోని టీమిండియా 100 పరుగులు సాధించింది. 

లక్ష్య చేధనను దాటిగా ప్రారంభించిన టీంఇండియా మధ్యలో కాస్త తడబడుతోంది. మంచి ఆరంభాన్ని అందించిన ఓపెనర్లిద్దరు వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. రోహిాత్(50), ధావన్(30) పరుగులు చేసి ఔటయ్యారు. 

టీంఇండియా పరుగుల వేగానికి బ్రేక్ పడింది. దాటిగా ఆడుతూ కేవలం 28 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్న రోహిత్ వెంటనే సోథి బౌలింగ్ లో ఔటయ్యాడు. 

159 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీంఇండియా అదరగొడుతుంది. ఓపెనర్లు చెలరేగి ఆడుతుండటంతో కేవలం 8 ఓవర్లలోనే 69 పరుగులు చేసింది. రోహిత్ వేగంగా ఆడుతూ కేవలం 28 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా శిఖర్ ధావన్ కూడా దాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 

అక్లాండ్ టీ20లో కివీస్ భారత్ ముందు 159 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలుత టీమిండియా బౌలర్ల ధాటికి ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ రాస్ టేలర్, గ్రాండ్ హోమ్మీలు ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

వీరిద్దరి నిష్క్రమణతో చివరి ఓవర్లలో న్యూజిలాండ్ పరుగులు చేయలేకపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో గ్రాండ్ హోమ్మీ 50, రాస్ టేలర్ 42 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కృణాల్ పాండ్యా 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.

చివరి ఓవర్లలో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. న్యూజిలాండ్ 8వ వికెట్ కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో టీమ్ సౌథీ 3 పరుగులకే ఔటయ్యాడు.

కివీస్ వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రమాద కర రాస్ టేలర్‌ రనౌట్ అయ్యాడు. పరుగు కోసం ప్రయత్నిస్తుండగా విజయ్ శంకర్ అతనిని రనౌట్ చేశాడు. 36 బంతుల్లో 42 పరుగులు చేసిన టేలర్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు.  ఆ వెంటనే మిచెల్ శాంట్నర్‌ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. 

వచ్చి రావడంతోనే ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడిన గ్రాండ్ హోమ్మీ ఔటయ్యాడు. అర్థసెంచరీ తర్వాత హార్డిక్ పాండ్యా బౌలింగ్‌లో గ్రాండ్‌హోమ్మీ వెనుదిరిగాడు. అంతకు కేవలం 28 బంతుల్లోనే అతను అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 4 సిక్సర్లు, 1 ఫోర్ ఉన్నాయి. 

కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఊపు మీదున్న కెప్టెన్ విలియమ్సన్ 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కృణాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

భారత బౌలర్ కృనాల్ పాండ్యా విజృంభించాడు. న్యూజిలాండ్‌ ఓపెనర్ మున్రోతో పాటు మిచెల్‌ను ఔట్ చేశాడు. దీంతో కివీస్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ క్రీజులో ఉన్నారు.

న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. తొలి టీ20లో తన విధ్వంసకర ఆటతో జట్టును గెలిపించిన ఓపెనర్ సీఫెర్ట్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ అక్లాండ్‌లో రెండో టీ20 జరగనుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ సారథి విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

మరోవైపు తొలి టీ20లో ఓటమిపై ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా భావిస్తుండగా.. ఈ మ్యాచ్‌‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. 

click me!