మెల్ బోర్న్ టెస్టులో మయాంక్‌కు అవమానం... అతిచేసిన ఆసిస్ కామెంటెటర్లు

By Arun Kumar PFirst Published Dec 26, 2018, 6:37 PM IST
Highlights

ఆస్ట్రేలియా టెస్ట్ సీరిస్ లో ఆటగాళ్ల మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది. కంగారు జట్టు సభ్యులు గత రెండు టెస్టుల్లో మాటలతోనూ, అనుచిత ప్రవర్తనతోనూ భారత ఆటగాళ్ళను... మరీ ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీని తీవ్రంగా అవమానించారు. వారికి ఆసిస్ మీడియా కూడా వంతపాడటంపై భారత అభిమానులకే కాదు ప్రపంచంలోని క్రికెట్ ప్రియులకూ నచ్చలేదు. ఇది చాలదన్నట్టు తాజాగా ఆసిస్ ఆటగాళ్లు, మీడియాను ఆ దేశ కామెంటేటర్లు కూడా ఫాలో అయ్యారు.

మెల్‌బోర్న్ టెస్టు ద్వారా భారత జట్టులోకి ఆరంగేట్ర చేసి...అర్థశతకంతో రాణించిన మయాంక్ అగర్వాల్ పై లైవ్ లోనే ఆసిస్ కామెంటేటర్లు అవమానకర రీతిలో సెటైర్లు విసిరారు. మయాంక్‌ను, భారత క్రికెట్ ను ఉద్దేశ్యించి ఆసిస్ కామెంటేటర్లు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

మెల్ బోర్న టెస్టులో కామెంటేటర్లుగా వ్యవహరించిన మార్క్ వా, కెర్రీ ఓ కెఫేలు తమ సెటైర్లతో మయాంక్ ను అవమానించారు. 2017-18 రంజీ ట్రోపిలో మయాంక్ కర్ణాటక జట్టుపై ట్రిపుల్ సెంచరీ( 304 నాటౌట్ ) సాధించాడు. ఈ ఇన్సింగ్స్ ను కెర్రీ ప్రస్తావిస్తూ...బహుషా మయాంక్ ఆ ట్రిపుల్ సెంచరీని క్యాటరింగ్ బాయ్స్, వెయిటర్లపై సాధించి ఉంటాడంటూ సెటైర్లు విసిరాడు. 

మరో కామెంటెటర్ మార్క్ వా అయితే ఏకంగా ఇండియన్ క్రికెట్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్ లో 50 పరుగులు చేస్తే...ఆసిస్ గడ్డపై అవి 40 పరుగులకు సమానమని వ్యాఖ్యానించాడు. 

లైవ్ లో ఈ ఇద్దరు వ్యాఖ్యాతలు చేసిన కామెంట్లపై భారత క్రికెట్ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరంగేట్ర ఆటగాడిగా మయాంక్ చక్కటి ఇన్నింగ్స్ ఆడితే క్రీడా స్పూర్తితో మెచ్చుకోవాల్సింది పోయి ఇలా అవమానించడం మంచిది కాదంటూ కామెంటేటర్లకు నెటిజెన్లు సూచించారు. 

click me!