IND vs NZ semi-final: వన్డే ప్రపంచకప్ 2023లో నేడు ఇండియా - న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ హాజరయ్యింది. స్టాండ్స్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి టీమిండియాకు సపోర్టు చేస్తూ.. బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తోంది. ఈ తరుణంలో మరోసారి కెమెరా కంటబడింది.
IND vs NZ semi-final: వన్డే ప్రపంచకప్ 2023లో నేడు ఇండియా - న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చూసేందుకు గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తన ఫ్రెండ్ తో విచ్చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేడు జరుగుతోన్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 47 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు.
ఈ మ్యాచ్ లో శుభ్‌మాన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. స్టాండ్స్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి టీమిండియాకు సపోర్టు చేస్తూ.. బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తోంది. ఈ తరుణంలో గిల్ బౌండరీ బాదిన ప్రతీసారి ఆమె ఎంజాయ్ చేస్తూ.. ఎంకరేజ్ చేస్తోంది. ఈ విషయం కెమెరామెన్ కంటబడింది. దీంతో కెమెరామెన్ శుభమన్ గిల్ బౌండరీ బాదినా ప్రతీసారి టీవీ కెమెరామెన్ సారా టెండూల్కర్‌ను చూపించడం ప్రారంభించాడు. శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ను సారా బ్యాటింగ్‌ను తెగ ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రపంచకప్ సందర్భంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సారా టెండూల్కర్ కూడా స్టేడియంలో కనిపించింది. అప్పుడు కూడా సారా వాంఖడే స్టేడియంలో శుభ్‌మన్ గిల్‌ను ప్రశంసించింది. WC 2023 సారా టెండూల్కర్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్‌ను చూడటానికి వచ్చారు, సారా టెండూల్కర్ - శుభ్‌మన్ గిల్ లు డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వారి రిలేషన్‌షిప్ గురించి వార్తలు ఉన్నాయి. కానీ ఇద్దరూ ఇంకా ధృవీకరించలేదు.
మరోవైపు.. సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ లు సీక్రెట్ గా మీట్ అయినట్టు తెలుస్తోంది. సారా టెండూల్కర్ గత రాత్రి ఫిల్మ్ మేకర్ విధు వినోద్ చోప్రా ఇంట్లో కనిపించారు. ఇంట్లోకి వెళ్లి బయటకు వస్తుండగా మీడియా కంటబడింది. ఫిల్మ్ మేకర్ గత రాత్రి టీమిండియా విందుకు పిలిచినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి టీమ్ మొత్తం వచ్చినట్లు చెబుతున్నారు. అయితే శుభ్‌మన్ ఉన్నాడా? లేదా? అన్నది ధృవీకరించబడలేదు.
ఇటీవల.. శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియాలో విధు వినోద్ చోప్రా చిత్రంపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. వీరిద్దరినీ విధు వినోద్ చోప్రా తన ఇంటికి పిలిపించుకున్నట్లు సమాచారం. సారా త్వరలో సినిమాల్లోకి రాబోతోందని, బహుశా అందుకే ఆమె చిత్ర నిర్మాత ఇంటికి చేరుకుందని కూడా వార్తలు వచ్చాయి. మీడియా నుండి తప్పించుకోవడానికి సారా టెండూల్కర్ ప్రయత్నించినా.. పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.