మరో రికార్డ్ సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ

By ramya neerukondaFirst Published Oct 22, 2018, 4:16 PM IST
Highlights

మూడేళ్ల పాటు వరుసగా 2,000పై చిలుకు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్‌ జాబితాలో విరాట్‌ చేరిపోయాడు.

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో రికార్డ్ ని తన సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే రికార్డ్ ల రారాజుగా పేరొందిన విరాట్.. అరుదైన ఘనతను సాధించాడు. మూడేళ్ల పాటు వరుసగా 2,000పై చిలుకు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్‌ జాబితాలో విరాట్‌ చేరిపోయాడు.

సచిన్ టెండుల్కర్ 1996-98 సంవత్సరాల మధ్య 2,000లకు పైగా పరుగులు సాధించాడు. మాథ్యూ హేడెన్‌ కూడా 2002-2004 సంవత్సరాల మధ్య ఏడాదికి రెండువేలకు పైగా పరుగులు సాధించాడు. జో రూట్‌ సైతం 2015-17 సంవత్సరాల మధ్య ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ సైతం 2015-18 సంవత్సరాల మధ్య ఏడాదికి రెండువేలకు పైగా పరుగులు చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 2083 పరుగులు సాధించాడు.

అంతేకాకుండా విండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కోహ్లీ వేగంగా అర్ధసెంచరీ సాధించాడు. కేవలం 35బంతుల్లోనే కోహ్లీ తన 49వ అర్ధసెంచరీని పూర్తి చేశాడు. ఇప్పటివరకు కోహ్లీ నాలుగో సారి అతి తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో కోహ్లీ కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. అతడి వన్డే కెరీర్‌లో అత్యంత తక్కువ బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయడం అదే తొలి సారి.

click me!