సచిన్ వరల్డ్ కప్ జట్టు.. ధోనికి దక్కని చోటు

Published : Jul 16, 2019, 02:39 PM IST
సచిన్ వరల్డ్ కప్ జట్టు.. ధోనికి దక్కని చోటు

సారాంశం

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన వరల్డ్ కప్ జట్టును ప్రకటించారు. క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా అత్యుత్తమ క్రికెట్ జట్టును సీనియర్ క్రికెటర్లు ప్రకటించడం మనకు తెలిసిన విషయమే. 


క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన వరల్డ్ కప్ జట్టును ప్రకటించారు. క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా అత్యుత్తమ క్రికెట్ జట్టును సీనియర్ క్రికెటర్లు ప్రకటించడం మనకు తెలిసిన విషయమే.  వరల్డ్ కప్ మొదలు కాకముందు  చాలా మంది దిగ్గజ క్రికెటర్లు తమ అభిమాన జట్టు ఇదే అంటూ ప్రకటించగా... తాజాగా సచిన్ ప్రకటించారు.

ఇందులో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు తన జట్టు సారథిగా ఎంపిక చేసిన సచిన్‌.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రాలకు భారత్‌ నుంచి చోటు కల్పించాడు.

ఇక ఇంగ్లండ్‌ నుంచి బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, బెయిర్‌ స్టోలను ఎంపిక చేసిన సచిన్‌.. బంగ్లాదేశ్‌ నుంచి షకీబుల్‌ హసన్‌కు తన జట్టులో అవకాశం ఇచ్చాడు. ఆసీస్‌ నుంచి మిచెల్‌ స్టార్క్‌ను మాత్రమే తన అత్యుత్తమ వరల్డ్‌కప్‌ ఎలెవన్‌ జట్టులో చోటిచ్చాడు.  కాగా, సచిన్‌ జట్టులో ఎంఎస్‌ ధోనికి చోటు దక్కకపోవడం గమనార్హం. ధోనీ ఆటతీరు సరిగా లేదంటూ వరల్డ్ కప్ సమయంలో సచిన్ విమర్శలు చేసిన విషయం కూడా తెలిసిందే.

సచిన్ ప్రకటించిన జట్టు ఇదే..
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, బెయిర్‌ స్టో(వికెట్‌ కీపర్‌), విరాట్‌ కోహ్లి, షకీబుల్‌ హసన్‌, బెన్‌ స్టోక్స్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్‌ స్టార్క్‌, బుమ్రా, జోఫ్రా ఆర్చర్‌

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !