నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నాను.. మాజీ క్రికెటర్

By ramya neerukondaFirst Published Dec 2, 2018, 11:53 AM IST
Highlights

గత కొద్ది రోజులుగా మెక్ కల్లమ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. ఆ వార్త తన వరకూ చేరడంతో.. మెక్ కల్లమ్ తాజాగా స్పందించాడు.

తాను చనిపోలేదని.. ఇంకా బతికే ఉన్నానని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ నాథన్ మెక్ కల్లమ్ స్పష్టం చేశారు.గత కొద్ది రోజులుగా మెక్ కల్లమ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. ఆ వార్త తన వరకూ చేరడంతో.. మెక్ కల్లమ్ తాజాగా స్పందించాడు.

‘నేను బతికే ఉన్నా. గతంలో కంటే ఇప్పుడు మరింత ఆరోగ్యంగా ఉన్నా. ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. ఇది ఫేక్‌ న్యూస్‌. లవ్‌యూఆల్‌’ అంటూ మెక్ కల్లమ్  అభిమానులనుద్దేశించి ఈ సెల్ఫీ దిగి ట్వీట్‌ చేశాడు.

కాగా.. మెక్ కల్లమ్ సోదరుడు మాత్రం ఈ విషయంపై తీవ్రంగా స్పందించాడు. బ్రతికి ఉన్న వ్యక్తిని చనిపోయారంటూ వార్తలు ఎలా క్రియేట్ చేస్తారంటూ మండిపడ్డారు.  ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేవారిని వదిలిపెట్టమని.. వారిని కచ్చితంగా పట్టుకొని శిక్ష పడేలా చేస్తానని హెచ్చరించారు. 

 ‘నా సోదరుడు చనిపోయాడని సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌ న్యూస్‌ పెట్టారు. ఇలాంటివి చూసి నా గుండె పగిలిపోయింది. నేను న్యూజిలాండ్‌కు తిరిగివస్తున్నా. ఈ న్యూస్‌ ఎవరు పెట్టారో వారిని పట్టుకుంటా’ అని మెక్ కల్లమ్ సోదరుడు బ్రెండన్‌ ట్వీట్‌ చేశాడు. 84 వన్డేలు, 63 టీ20లు ఆడిన మెక్ కల్లమ్ 2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 

click me!