England Womens vs India Womens : హర్మన్ ప్రీత్ అద్భుత సెంచరీ... ఇది కదా కెప్టెన్ ఇన్నింగ్స్

Published : Jul 22, 2025, 10:59 PM ISTUpdated : Jul 22, 2025, 11:05 PM IST
Smriti Mandhana-Harmanpreet kaur

సారాంశం

ఇంగ్లాండ్ ఉమెన్స్ టీంపై ఇప్పటికే టీ20 సీరిస్ లో ఆదిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిచింది టీమిండియా. ఇప్పుడు వన్డే సీరిస్ పై కూడా కన్నేసింది… నిర్ణయాత్మక చివరి మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సెంచరీతో అదరగొట్టింది. 

DID YOU KNOW ?
హర్మన్ నయా రికార్డ్
టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రికార్డును ప్రస్తుత కెప్టెన్ హర్మన్ బద్దలుగొట్టింది. అత్యధిక అంతర్జాతీయ మ్యాచులాడిన బ్యాటర్ గా హర్మన్ నిలిచింది.

INDW vs ENGW : ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొడుతూ సూపర్ సెంచరీ సాధించింది టీమిండియా ఉమెన్స్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. కేవలం 84 బంతుల్లోనే 102 పరుగులు చేశారామె... ఇందులో 14 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్ కు మిగతా బ్యాటర్స్ కూడా పరుగులు జోడించడంతో టీమిండియా ఏకంగా 318 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచింది.

మూడు టెస్టుల వన్డే సీరిస్ లో ఇప్పటికే రెండు మ్యాచులు ముగిసాయి... ఇందులో ఇరు జట్లు చెరో మ్యాచ్ లో విజయం సాధించాయి. దీంతో సీరిస్ విజేతను నిర్ణయించే మూడు వన్డే చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఓపెనింగ్ బ్యాటర్లు శుభారంభం అందించారు... హాఫ్ సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రతీక రావల్ 26,  స్మృతి మంధాన 45 పరుగులు చేశారు. మరో బ్యాటర్ హర్లీన్ డియోల్ కూడా 45 పరుగులు చేశారు.

ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుత సెంచరీతో టీమిండియా స్కోరు జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. ఈ సెంచరీకి జెమ్మిమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ (50 పరుగులు) తోడయ్యింది. చివర్లో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ (18 బంతుల్లో 38 పరుగులు) తో టీమిండియా స్కోరు 318 కు చేరుకుంది. ఆతిథ్య ఇంగ్లాండ్ 319 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

India vs Sri Lanka : స్మృతి మంధాన విశ్వరూపం.. ఒకే మ్యాచ్‌లో రికార్డుల మోత
ఐపీఎల్ 2026 ముందే RCBకి గట్టి షాక్.. పాపం.! కోహ్లీ టీం ఇది అస్సలు ఊహించలేదు