నటి ఈషా గుప్తాతో డేటింగ్ పై హార్దిక్ పాండ్యా స్పందన ఇదీ...

Published : Jan 08, 2019, 08:28 AM IST
నటి ఈషా గుప్తాతో డేటింగ్ పై హార్దిక్ పాండ్యా స్పందన ఇదీ...

సారాంశం

ఈషా గుప్తాతో డేటింగ్‌ వార్తలపై తెలివిగా హార్దీక్ పాండ్యా సమాధానం ఇచ్చాడు. అమ్మాయిని చూడడం, డేటింగ్, రిలేషన్‌షిప్... ఈ మూడూ ఒకటేనని తాను గతంలో భావించేవాడనని అన్నాడు. 

ముంబై: బాలీవుడ్ నటి ఈషా గుప్తాతో డేటింగ్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు స్పందించాడు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’లో కేఎల్ రాహుల్‌తో కలిసి అతను పాల్గొన్నాడు. 

ఈషా గుప్తాతో డేటింగ్‌ వార్తలపై తెలివిగా హార్దీక్ పాండ్యా సమాధానం ఇచ్చాడు. అమ్మాయిని చూడడం, డేటింగ్, రిలేషన్‌షిప్... ఈ మూడూ ఒకటేనని తాను గతంలో భావించేవాడనని అన్నాడు. అయితే, ఇప్పుడు మరో విషయం తెలిసిందని, తొలి రెండింటికీ కమిట్‌మెంట్ అవసరం లేదని, మూడో దానికి అది చాలా అవసరమని అన్నాడు. తద్వారా డేటింగ్ విషయాన్ని దాటవేశాడు.
 
బాలీవుడ్ తారలు ఎల్లీ అవ్రామ్, పరిణీతి చోప్రాలతో కూడా పాండ్యా డేటింగ్‌లో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల మాత్రం ఈషా గుప్తా తెరపైకి వచ్చింది. ఈషాతో చాలా డీప్‌గా ఉన్నాడని, త్వరలోనే ఇద్దరూ పెళ్లాడబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. 

హార్దిక్‌తో డేటింగ్‌పై జరుగుతున్న ప్రచారంపై ఈషా గతంలోనే వివరణ ఇచ్చింది. అది తనకు సంబంధించిన విషయమని అన్నది. అతడిని పెళ్లాడాలా? వద్దా? అనే విషయాన్ని తనకు వదిలేయాలని సోషల్ మీడియా వేదిక ఆమె చెప్పింది. తన స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని సూచించింది.

PREV
click me!

Recommended Stories

టీ20 ప్రపంచకప్ ముందే పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ టోర్నీకి దూరం.!
ఒక్కడి కోసం.. ఆ ఇద్దరిని టెస్టుల నుంచి తప్పించారా..? ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్న