నా వీడియోలు తీశారు... తెలుగు జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి సంచలన ఆరోపణలు..!

By telugu news teamFirst Published May 28, 2022, 9:31 AM IST
Highlights

మెల్‌బోర్న్‌ వరల్డ్‌ కప్‌లో వ్యక్తిగత పతకం (వాల్ట్‌లో కాంస్యం) సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పిన ఆమె... తాజాగా చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశంలో దుమారం రేపుతున్నాయి.


ప్రతిష్ఠాత్మక బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ కోసం సిద్ధమవుతున్న రాష్ట్ర యువ జిమ్నాస్ట్‌ బుద్దా అరుణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 2018 మెల్‌బోర్న్‌ వరల్డ్‌ కప్‌లో వ్యక్తిగత పతకం (వాల్ట్‌లో కాంస్యం) సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పిన ఆమె... తాజాగా చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశంలో దుమారం రేపుతున్నాయి.

తన అనుమతి లేకుండా తన ఫిజికల్ టెస్ట్ వీడియో తీశారని ఆమె ఆరోపించింది.  భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) కోచ్‌ ఒకరు ఈ పని చేశారని ఆమె వెల్లడించింది. అయితే అరుణ శారీరక సామర్థ్య విశ్లేషణ పరీక్షకు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని భారత జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య (జీఎ్‌ఫఐ) వెల్లడించడంతో.. ఈ విషయంలో తాను న్యాయపోరాటానికి దిగుతున్నట్లు ఆమె వెల్లడించడం గమనార్హం.

దీన్ని పరిగణనలోకి తీసుకున్న సాయ్‌.. ముగ్గురు సభ్యులతో విచారణకు ఆదేశించింది. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాధికా శ్రీమాన్‌ అధ్యక్షత వహించనున్న కమిటీలో కోచ్‌ కమలేశ్‌ తివాన, డిప్యూటీ డైరెక్టర్‌ కైలాశ్‌ మీనా సభ్యులుగా ఉన్నారు. ఇరు పక్షాల వాదనలు పరిశీలనలోకి తీసుకుంటూ వచ్చే వారంలో కమిటీ నివేదిక తయారు చేయనుంది.

ఆ పరీక్ష ఎలా చేశారంటే... బాకులో జరిగిన జిమ్నాస్టిక్స్‌ ప్రపంచ కప్‌ను పురస్కరించుకొని..జీఎ్‌ఫఐ సూచన మేరకు ఢిల్లీలో జరిగిన శారీరక సామర్థ్య విశ్లేషణ పరీక్షకు కోచ్‌ మనోజ్‌ రాణా తో కలిసి అరుణ హాజరైంది. 10 నిమిషాల ఈ మొత్తం పరీక్షను కోచ్‌ రోహిత్‌ జైస్వాల్‌ దగ్గర శిక్షణ పొందుతున్న జిమ్నాస్ట్‌ ఒకరు వీడియో తీశారని అరుణ వెల్లడించింది. 

ఈ పరీక్ష అనంతరం అంబాలలో శిక్షణ శిబిరానికి వెళ్లిపోయిన అరుణ..తన వ్యక్తిగత ఆర్థోపెడిక్‌ డాక్టర్‌కు వీడియో చూపించి, ఆయన నుంచి పునరావాస సూచనలు తెలుసుకోవాలని భావించింది. దాంతో తనకు ఫిట్‌నెస్‌ పరీక్ష సందర్భంగా తీసిన వీడియోను పంపాలని జీఎ్‌ఫఐని కోరింది. అయితే అరుణకు జరిపిన శారీర సామర్థ్య విశ్లేషణ పరీక్షను వీడియో షూట్‌ చేయాలని తాము ఆదేశించలేదని జీఎ్‌ఫఐ అధ్యక్షుడు సుధీర్‌ మిట్టల్‌ ఆమెకు లేఖ రాశారు. మిట్టల్‌ జవాబుతో నివ్వెరపోయిన అరుణ.. జీఎఫ్‌ఐ అనుమతి లేకుండా ఓ మహిళా జిమ్నా్‌స్టను వీడియో తీయడం నేరమని, దానిపై తాను న్యాయస్థానానికి వెళ్లనున్నట్టు హెచ్చరించింది.

click me!