జాతీయ క్రీడాభివృద్ది కోసం క్రీడా విధానాన్ని ప్రభుత్వం, ఒలింపిక్ సంఘం, క్రీడా సమాఖ్యలు రూపొందించాలి కానీ భారత్‌లోని న్యాయస్థానాలు కాదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ : జాతీయ క్రీడాభివృద్ది కోసం క్రీడా విధానాన్ని ప్రభుత్వం, ఒలింపిక్ సంఘం, క్రీడా సమాఖ్యలు రూపొందించాలి కానీ భారత్‌లోని న్యాయస్థానాలు కాదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు వ్యాఖ్యానించారు.
నేషనల్ కోడ్ ఫర్ గుడ్ గవర్నన్స్ ఇన్ స్పోర్ట్స్ 2017 ముసాయిదాపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో క్రీడా మంత్రిత్వ శాఖ తరఫున ఆ శాఖ కార్యదర్శి రాధేశ్యామ్ కీలక అఫడవిట్ దాఖలు చేశారు.
undefined
Also read: గంగూలీ పదవి ఆ పుణ్యమే: బిసిసిఐ తీరుపై లోథా విస్మయం
ముసాయిదా క్రీడా విధానంలో చాలా నిబంధనలు క్రీడా సమాఖ్యలు, ఒలింపిక్ సంఘం స్వతంత్య్రత, స్వేచ్ఛను హరిస్తున్నాయని అఫడవిట్‌లో క్రీడా శాఖ పేర్కొన్నది. ఇప్పుడున్న రూపంలోనే క్రీడా విధానాన్ని అమలు చేయదలిస్తే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత జెండా పట్టుకుని మన అథ్లెట్లు పోటీపడే అవకాశం కోల్పోతారని అఫడవిట్‌లో క్రీడా శాఖ పొందుపరిచింది.
'ఇది చాలా సింపుల్. క్రీడా శాఖ ప్రతిపాదిత ముసాయిదా క్రీడా విధానాన్ని తిరస్కరించింది. జాతీయ క్రీడా విధానం ఇలాగే ఉండాలని న్యాయస్థానాలు చెప్పజాలవు. ఈ విషయంపై మంత్రిత్వ శాఖ అభిప్రాయం చెప్పాలని కోర్టు నోటీసు ఇచ్చింది. బదులుగా మా సమాధానం తెలియజేశాం. భారత స్పోర్ట్స్ పాలసీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది, న్యాయస్థానాలు కాదు' అని కిరణ్ రిజుజు అన్నారు.
క్రీడా విధానాల్లో కోర్టుల జోక్యం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడా సమాఖ్యలు స్వతంత్రంగా ఉంటేనే నూతన టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించగలుగుతారని, ఇలా కోర్టుల అతిజోక్యం వల్ల క్రీడాకారులతోపాటు దేశంలో క్రీడలకు కూడా ఆదరణ తగ్గే ప్రమాదం పొంచి ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఇకపోతే బీసీసీఐ లో లోధా కమిటీ సిఫార్సులకు తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయమై కొన్ని రోజుల కింద లోధా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సంస్కరణలు అమలు చేయడం చాలా దురదృష్టకరం అని ఆయన వ్యాఖ్యానించారు. బీసీసీఐలో పాత వ్యవస్థనే గనుక కొనసాగుతూ ఉండి ఉంటే, ఓ మాజీ క్రికెటర్ బీసీసీఐ అధ్యక్షుడి పదవిలో కూర్చోవాలని కనీసం కలలో కూడా ఊహించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Also read: గంగూలీని అడ్డం పెట్టి లోథా కమిటీ సిఫార్సులకు తూట్లు
క్రికెట్ రాజకీయాలలో సంస్కరణలు అమలు కాకుంటే, ఓ క్రికెటర్ బీసీసీఐ అధ్యక్షుడిగా అయ్యేవాడే కాదని ఆయన వ్యాఖ్యానించారు. పాత వ్యవస్థను తిరిగి తీసుకురావాలని ప్రయత్నించడం మాని, సంస్కరణలను మరింత చిత్తశుద్దితితో అమలు చేయాలనీ ఆయన కోరారు.
ఒక వేళ ఈ సంస్కరణలు ఫలితాన్నిస్తాయా అనే అనుమానమే గనుక ఉంటే, ఈ సంస్కరణలు ఫలితాలు సాధిస్తాయి అని ఋజువు కావాలంటే గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడవ్వడమే ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణలు అమలు చేసేందుకు ఈ ఒక్క కారణం చాలని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత క్రికెట్‌లో సంస్కరణలు కొంత కాలం అమలు జరిగితే పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనం మరింతబాగా తెలిసొస్తుంది అని జస్టిస్ ఆర్‌ఎం లోధా వ్యాఖ్యానించారుగంగూలీ పదవి ఆ పుణ్యమే: బిసిసిఐ తీరుపై లోథా విస్మయం