మంగళవారం ఉదయం కాలిఫోర్నియాలో ప్రమాదం...
అతివేగంతో దూసుకెళ్తూ బోల్తా పడిన టైగర్ వుడ్స్ కారు...
గోల్ఫ్ సూపర్ స్టార్ టైగర్ వుడ్స్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 82 టైటిళ్లు, 15 మేజర్ ఛాంపియన్‌షిప్‌లు కైవసం చేసుకుని, గోల్ఫ్‌లో తిరుగులేని లెజెండరీ ప్లేయర్‌గా నిలిచిన 45 ఏళ్ల టైగర్ వుడ్స్... మంగళవారం లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియాలో ప్రమాదానికి గురయ్యారు.
టైగర్ వుడ్స్ ప్రయాణస్తున్న కారు అదుపు తప్పి, బోల్తా కొట్టి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో టైగర్ వుడ్స్ ఒక్కడే ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకుని ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
undefined
కారు బోల్తా పడిన వెంటనే బెలూన్స్ తెరుచుకోవడంతో టైగర్ వుడ్స్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంలో టైగర్ వుడ్స్ కాళ్లకు గాయాలయ్యాయి. రెండు కాళ్లకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ఇంతకుముందు 2009లో కూడా ఫ్లోరిడాలో కారు ప్రమాదంలో గాయపడ్డారు టైగర్ వుడ్స్.