జో రూట్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్... జాక్ క్రావ్లే హాఫ్ సెంచరీ...

Published : Feb 24, 2021, 04:22 PM IST
జో రూట్ అవుట్... మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్... జాక్ క్రావ్లే హాఫ్ సెంచరీ...

సారాంశం

74  పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్... రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో జో రూట్ అవుట్...  

టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 37 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన జో రూట్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలిన్ చేరాడు. 74 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్.

27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జో రూట్, జాక్ క్రావ్లే కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. జాక్ క్రావ్లే 80 బంతుల్లో 10 ఫోర్లతో 53 పరుగులు చేసి, టెస్టుల్లో నాలుగో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. క్రావ్లేతో కలిసి 94 బంతుల్లో 47 పరుగుల భాగస్వామ్యం జోడించిన జో రూట్, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

జో రూట్ రివ్యూ తీసుకున్నా, అంపైర్స్ కాల్ నిర్ణయం రావడంతో మూడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. డొమినిక్ సిబ్లీ, బెయిర్ స్టో ఇద్దరూ డకౌట్ అయ్యారు. 

PREV
click me!

Recommended Stories

IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..
IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !