Manavaditya Rathore: భారత్ కు 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో షూటింగ్ లో రజతం సాధించిన మాజీ ఒలింపియన్, కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ కొడుకు.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
మాజీ ఒలింపియన్ రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ కుమారుడు తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచాడు. తండ్రి మాదిరే చిన్నప్పట్నుంచే షూటింగ్ లో మెలుకువలు నేర్చుకున్న మానవాదిత్య రాథోడ్.. పెరూలో ఇటీవలే ముగిసిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) లో మానవాదిత్య కాంస్య పతకంతో మెరిశాడు. బ్రెజిల్ తో జరిగిన కాంస్య పోరులో మానవాదిత్య తో పాటు శపత్ భరద్వాజ్, క్యానన్ చెనై లు రాణించడంతో భారత్ కాంస్యం నెగ్గింది.
ఫైనల్ షూట్ అవుట్ లో మానవాదిత్య 70/75 స్కోరు చేయగా.. శపత్.. 64/75, క్యానన్ 71/75లు కూడా రాణించారు. దీంతో భారత్ మొత్తంగా 205 పాయింట్లు సాధించింది. అయితే బ్రెజిల్ కూడా భారత్ కు ధీటుగానే రాణించింది. దీంతో పోరు 5-5 తో సమమైంది. అయితే షూటవుట్ లో భారత్ కు విజయం దక్కింది.
undefined
ఈ విజయానికి ముందు మానవాదిత్య తన సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ.. ‘ఇదే నా మొదటి సీనియర్ వరల్డ్ కప్ మెడల్. నా ప్రయాణంలో భాగమైన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఈ అవకాశమిచ్చిన క్రీడా శాఖకు ధన్యవాదాలు.’ అని రాసుకొచ్చాడు.
మ్యాచ్ గెలిచిన అనంతరం పోస్ట్ చేస్తూ.. ‘మా టీమ్ మీద నమ్మకముంచిన వారందరికీ ధన్యవాదాలు. నా దేశం కోసం ఇంకా భాగా ఆడటానికి కృషి చేస్తా. దేశానికి మరిన్ని పతకాలు సాధిస్తా....’ అని రాసుకొచ్చాడు.
కాగా. రాజస్థాన్ కు చెందిన రాజ్యవర్ధన్ సింగ్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో భారత్ కు రజతం అందించాడు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాజ్యవర్ధన్.. ప్రధాని మోడీ నేతృత్వంలోని 17వ లోక్ సభ లో సభ్యుడే గాక క్రీడా శాఖ మంత్రిగా కూడా పని చేశారు.