క్రీడా రంగంలో ఉన్న ఉమెన్ ప్లేయర్లలో సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందని ఇటీవల గూగుల్ లో ఓ పోల్ నిర్వహించగా అందులో..
ఉమెన్ స్పోర్ట్స్ లో కుర్రకారు అత్యధికంగా వెతికే ప్లేయర్ గా ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారిణి, స్విట్జర్లాండ్‌కు చెందిన అలీషా లెహ్మన్ అగ్రస్థానంలో నిలిచింది. క్రీడా రంగంలో ఉన్న ఉమెన్ ప్లేయర్లలో సోషల్ మీడియాలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందని ఇటీవల గూగుల్ లో ఓ పోల్ నిర్వహించగా అందులో 24 ఏండ్ల అలీషాకు అందరూ ఓటు వేశారు. అలీషాకు ఇన్‌స్టాలో 13.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన ఫుట్‌బాల్ ట్రైనింగ్ వీడియోలతో పాటు ఈ అమ్మడు బికినీ ఫోటో షూట్లతో చేసే రచ్చ మామూలుగా ఉండదు.
కాగా స్పిన్ జెనీ అనే ఓ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉమెన్స్ స్పోర్ట్స్ ప్లేయర్స్ లో ఆన్‌లైన్ లో ఎక్కువ మంది వెతికిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందగా ఈ జాబితాలో టాప్ - 10 లో ఆర్సీబీ ఆల్ రౌండర్, ఆసీస్ కు చెందిన ఎలీస్ పెర్రీ కూడా చోటు దక్కించుకోవడం గమనార్హం.
undefined
ఈ జాబితాలో పెర్రీ.. టాప్ -10లో నిలిచింది. క్రికెట్ నుంచి ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్న ఏకైక క్రీడాకారిని పెర్రీ మాత్రమే. అలీషా తర్వాత టెన్నిస్ సంచలనం ఎమ్మా రడుకాను రెండో స్థానంలో ఉంది. ఆన్‌లైన్ లో గత రెండేండ్లుగా ఎవరిని ఎక్కువగా వెతికారు..? అన్నదానిపై ఈ సర్వేను నిర్వహించారు. సర్వే వివరాలు ఇక్కడ ఉన్నాయి.
టాప్ - 10 స్పోర్ట్స్ క్రష్ లిస్ట్
1. అలీషా లెహ్మన్ (స్విట్జర్లాండ్ - ఫుట్‌బాల్) : 4,91,500 సెర్చ్‌లు
2. ఎమ్మా రడుకాను (ఇంగ్లాండ్ - టెన్నిస్) : 3,60,630
3. కమిల గ్లోర్గీ - (ఇటలీ - టెన్నిస్) : 2,51,00
4. సెరెనా విలియమ్స్ (యూఎస్ - టెన్నిస్) : 2,49,500
5. అలెక్స్ మోర్గాన్ (అమెరికా - సాకర్) : 1,82,800
6. మరియా షరపోవా (రష్యా - టెన్నిస్) : 1,75,700
7. అలీసా స్కిమ్డ్ట్ (జర్మనీ - అథ్లెట్) : 170,500
8. పైగ్ వంజంట్ (అమెరికా - మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ) : 160,300
9. డానిస్ పాట్రిక్ (అమెరికా - రేస్ కార్ డ్రైవర్) : 137,600
10 ఎలీస్ పెర్రీ (ఆస్ట్రేలియా - క్రికెట్) : 117,100