అండర్-17 మహిళల ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు మార్గం సుగమం.. ఏఐఎఫ్ఎఫ్‌పై నిషేధాన్ని ఎత్తేసిన ఫిఫా

By team teluguFirst Published Aug 27, 2022, 9:29 AM IST
Highlights

ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా విధించిన నిషేధం తొలగిపోయింది. దీంతో అండర్-17 మహిళల ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం తిరిగి లభించింది. 

భారత ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రపంచ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫా నుంచి భారత్‌కు పెద్ద ఊరట లభించింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF)పై విధించిన నిషేధాన్ని ఫిఫా (FIFA) ఎత్తివేసింది. ఈ మేర‌కు ఫిఫా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎఐఎఫ్‌ఎఫ్‌పై సస్పెన్షన్‌ను ఆగస్టు 25వ తేదీ నుంచి వెంటనే ఎత్తివేయాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు ఫిఫా తన ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల FIFA అండ‌ర్ -17 మహిళల ప్రపంచ కప్ అక్టోబర్ 11 నుండి 30 వరకు ఇండియాలో నిర్వ‌హించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

శుబ్‌మన్ గిల్‌ని అన్‌ఫాలో చేసిన సారా టెండూల్కర్... ఇద్దరికీ బ్రేకప్ అయిపోయిందంటూ...

FIFA విడుదల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. AIFF ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలను చేపట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (CoA) రద్దు చేయబడిందని, AIFF అడ్మినిస్ట్రేటివ్ రోజువారీ వ్యవహారాలను చేపట్టిందని FIFA ధృవీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఫిఫా, AFC పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటాయని ప్రకటన పేర్కొంది. అదే సమయంలో సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో AIFF కి ఫిఫా సాయం చేయ‌నుంది. 

ఫిఫా ఆగస్ట్ 16వ తేదీన AIFFని సస్పెండ్ చేసింది. వాస్తవానికి మూడో పక్షం జోక్యం కారణంగా FIFA.. AIFFని సస్పెండ్ చేసింది. ఫిఫా చెప్పిన కార‌ణాల ప్ర‌కారం నిబంధనలు, రాజ్యాంగానికి తీవ్రమైన ఉల్లంఘన జరిగింది. ఈ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 85 ఏళ్ల ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AIFF) చరిత్రలో తొలిసారిగా FIFA నుంచి సస్పెన్షన్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదొక్కటే కాకుండా అక్టోబర్‌లో జ‌ర‌గాల్సి ఉన్న అండర్-17 మహిళల ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కులను కూడా భారత్ నుంచి లాగేసుకుంది. అయితే తాజా నిర్ణ‌యంతో మరోసారి భారత్ ఈ హక్కులను పొందింది.

అశ్విన్‌ని లెగ్ స్పిన్ వేయొద్దని చెప్పిన ముత్తయ్య మురళీధరన్.. ఎందుకని అడిగితే...

ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇవ్వ‌డం భారతదేశానికి ఒక మంచి అవకాశం. దీని వ‌ల్ల ఆతిథ్య దేశపు జాతీయ జట్టు టోర్నమెంట్ మెయిన్ డ్రాకు ఆటోమెటిక్ గా అర్హత సాధించేలా చేస్తుంది. దీంతో పాటు భారత పురుషులు, మహిళల జ‌ట్లు రెండు కూడా ఆసియా ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ల వంటి ఖండాంతర పోటీలలో పాల్గొనవచ్చు.

షాహీన్‌ లేకపోతేనేం, టీమిండియాని ఓడించడానికి వీళ్లు చాలు... పాక్ హెడ్ కోచ్ షాకింగ్ కామెంట్స్...

అయితే AIFF ఎన్నికలకు ముందు అధ్య‌క్ష ప‌ద‌వికి నామినీ అయిన భైచుంగ్ భూటియా తన తోటి మాజీ ఫుట్‌బాల్ ఆటగాళ్లను కలిసి భారత ఫుట్‌బాల్ వ్యవస్థను శుభ్రం చేయాలని కోరారు. భారత ఫుట్‌బాల్‌కు మార్గనిర్దేశం చేసేందుకు తానే సరైన వ్యక్తి అని, రాజకీయాలను క్రీడలకు దూరంగా ఉంచాలని కోరారు.
 

click me!