నేను కెప్టెన్సీ ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందంటే

By sivanagaprasad KodatiFirst Published Sep 13, 2018, 1:56 PM IST
Highlights

టీమిండియాకు సారథ్యం వహించిన వారిలో మహేంద్ర సింగ్ ధోనీ ముందు వరుసలో నిలుస్తాడు. టెస్టుల్లో, వన్డేల్లో జట్టును అగ్రస్థానంలో నిలపడమే కాకుండా.. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్‌ ట్రోఫీలను జట్టుకు అందించాడు. 

టీమిండియాకు సారథ్యం వహించిన వారిలో మహేంద్ర సింగ్ ధోనీ ముందు వరుసలో నిలుస్తాడు. టెస్టుల్లో, వన్డేల్లో జట్టును అగ్రస్థానంలో నిలపడమే కాకుండా.. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్‌ ట్రోఫీలను జట్టుకు అందించాడు. కెప్టెన్‌గా వరుస విజయాలతో దూసుకెళుతున్న సమయంలో 2016లో హఠాత్తుగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.

ఈ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులను, మాజీ క్రికెటర్లను విస్మయ పరిచింది. కోచ్, బీసీసీఐ ఒత్తిడి వల్లే ధోనీ కెప్టెన్సీకి రాజీనామా చేశాడని ప్రచారం జరిగింది. అయితే రెండేళ్ల తర్వాత అందుకు కారణం తెలిపాడు మహీ.. ‘‘ 2019 వరల్డ్‌కప్ సన్నద్ధత కోసం తర్వాతి కెప్టెన్‌కు తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే తాను కెప్టెన్సీకి వీడ్కోలు పలికినట్లు చెప్పాడు..

ఇక ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఓటమిపై మాట్లాడుతూ... సిరీస్‌కు ముందు తగినన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడం వల్లే టెస్టు సిరీస్ కోల్పోవాల్సి వచ్చిందని ధోనీ పేర్కొన్నాడు.

click me!