ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు అప్పుడే పుట్టిన కవలల్లో ఒకరు మృతి చెందాడు. ఈ మేరకు ఆయన ఓ భావోద్వేగ పోస్టును ట్విటర్ తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.
ఫుట్బాల్ స్టార్ Cristiano Ronaldo ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ జంటకు అప్పుడే జన్మించిన కవలల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని రోనాల్డో social mediaల్లో పోస్ట్ చేశారు. ‘అప్పుడే పుట్టిన మా బాబు చనిపోయిన విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏ తల్లిదండ్రులకు అయినా ఇది భరించలేని విషాదం. పాప బతికి ఉన్న విషయం ఒక్కటే ఇప్పుడు మాకు కొంత ఆశ. ఆనందాన్ని ఇవ్వగలదు. ఈ సమయంలో మా వెంట ఉన్న డాక్టర్లకు, నర్సులకు ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరుతున్నాం’ అని రోనాల్డో ఉద్వేగపూరితమైన పోస్ట్ ను షేర్ చేశాడు.
ఇప్పటికే జార్జినా-రోనాల్డో జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు, కవలలు పుట్టే అవకాశం ఉందని గత అక్టోబర్లో ఈ జంట పేర్కొంది. ఈ ఫుట్ బాల్ దిగ్గజం ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబానికి కేటాయిస్తాడు. తన కుటుంబమే తనకు బలమని ఎప్పటికీ చెబుతుంటారు. ఇటీవలే అతని జట్టు పోర్చుగల్ ఈ ఏడాది ఖతార్ లో జరిగే ప్రపంచకప్ కు అర్హత సాధించింది.
undefined