Sports Schedule in January 2023: జనవరిలో ఇండియా-శ్రీలంక టీ20 సిరీస్, వన్డే సిరీస్ తో పాటు మహిళల అండర్ - 19 ప్రపంచకప్ కూడా ఉంది. కొంతకాలంగా భారత్ లో మళ్లీ క్రేజ్ దక్కించుకుంటున్న హాకీ ప్రపంచకప్ కూడా ఈనెలలోనే జరగాల్సి ఉంది.
భారత క్రీడా రంగానికి గతేడాది ఆశించినదానికంటే ఎక్కువ ఫలితాలే వచ్చాయి. బ్యాడ్మింటన్ లో థామస్ కప్ విజయం, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ లో నీరజ్ చోప్రాకు పతకం, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ (మహిళల)గా నిఖత్ జరీన్, కామన్వెల్త్ క్రీడలలో భారత్ జయకేతనం వంటివి ముఖ్యమైనవి. ఈ ఏడాది కూడా క్రీడాభిమానులకు పండుగే. క్రికెట్‌తో పాటు హాకీ ప్రపంచకప్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, అథ్లెటిక్స్ వంటి చాలా క్రీడా ఈవెంట్లు ఇందులో భాగంగా ఉన్నాయి. 2023 జనవరి నుంచే వివిధ క్రీడాంశాలు ప్రారంభం కాబోతున్నాయి.
జనవరిలో ముఖ్యంగా ఇండియా-శ్రీలంక టీ20 సిరీస్, వన్డే సిరీస్ తో పాటు మహిళల అండర్ - 19 ప్రపంచకప్ కూడా ఉంది. అలాగే గత కొంతకాలంగా భారత్ లో మళ్లీ క్రేజ్ దక్కించుకుంటున్న హాకీ ప్రపంచకప్ కూడా ఈనెలలోనే జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ చూద్దాం.
undefined
క్రికెట్ : ఇండియా వర్సెస్ శ్రీలంక (జనవరి 3 నుంచి 15 వరకూ మూడు టీ20లు, మూడు వన్డేలు)
షెడ్యూల్ :
టీ20 సిరీస్ షెడ్యూల్ :
- జనవరి 3 : తొలి టీ20 - వాంఖడే స్టేడియం, ముంబై
- జనవరి5 : రెండో టీ20 - మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం, పూణే
- జనవరి 7 : మూడో టీ20 - రాజ్‌కోట్
వన్డే సిరీస్ షెడ్యూల్ :
- జనవరి 10 : తొలి వన్డే - గువహతి
- జనవరి 12 : రెండో వన్డే - కోల్‌కతా
- జనవరి 15 : మూడో వన్డే - తిరువనంతపురం
న్యూజిలాండ్ తో..
- జనవరి 18న తొలి వన్డే
- జనవరి 21న రెండో వన్డే
- జనవరి 24న మూడో వన్డే
- జనవరి 27న తొలి టీ20
- జనవరి 29న రెండో టీ20
- ఫిబ్రవరి 01న మూడో టీ20 జరుగుతాయి.
- జనవరి 14 నుంచి అండర్ - 19 మహిళల ప్రపంచకప్ జరుగనుంది. 16 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్.. గ్రూప్-డీలో ఉంది. జనవరి 29 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది.
- జనవరి 13 నుంచి 29 వరకూ భారత్ లోనే హాకీ ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఒడిషా వేదికగా ఇది జరుగుతుంది.
- జనవరి 14 నుంచి 29 వరకూ ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతుంది.
- జనవరి 31 నుంచి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (మధ్యప్రదేశ్) లో జరుగనున్నాయి.
- అథ్లెటిక్స్ విభాగంలోకి వస్తే.. జనవరి 7, 8న అసోంలో నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్స్ జరగాల్సి ఉంది. జనవరి 12 నుంచి 14 వరకూ బీహార్ లో నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ జరుగుతుంది.