ఐపీఎల్ ఫైనల్... కప్ దక్కినా... రోహిత్ శర్మ అప్ సెట్

By telugu teamFirst Published May 13, 2019, 8:03 AM IST
Highlights

ఐపీఎల్ 2019 ముగిసింది. ఆదివారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు హైదరాబాద్ వేదికగా హోరా హోరీగా తలపడ్డాయి. 


ఐపీఎల్ 2019 ముగిసింది. ఆదివారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు హైదరాబాద్ వేదికగా హోరా హోరీగా తలపడ్డాయి. ఈ పోరులో... ఎట్టకేలకు విజయం ముంబయి ఇండియన్స్ ని వరించింది. ఐపీఎల్ సీజన 12 కప్ ని ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దాడారు. అయితే...  కప్ చేతికి అందినా... ఆట మధ్యలో జరిగిన ఓ చిన్న వివాదం కారణంగా రోహిత్ శర్మ అప్ సెట్ అయినట్లు సమాచారం.

ఇంతకీ మ్యాటరేంటంటే...టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు కొట్టిన డికాక్.. శార్దూల్ వేసిన అతడి రెండో ఓవర్‌ నాలుగో బంతికి  సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే డికాక్‌ను శార్దూల్ ఇంటికి పంపాడు. అతడు అవుట్ కావడంతో శార్దూల్ సంతోషం పట్టలేకపోయాడు.

‘నా బౌలింగ్‌లోనే సిక్సర్ కొడతావా?’ అన్నట్టు డికాక్ వైపు వేలు చూపిస్తూ ‘వెళ్లు, వెళ్లు’ అన్నట్టు సైగ చేశాడు. నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రోహిత్ ఇది చూసి తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. శార్దూల్ తీరుపై అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. శార్దూల్ వద్దకు వెళ్లిన అంపైర్ ఇయాన్ గౌల్డ్ అతడితో ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత శార్దూల్ నవ్వుతూ కనిపించడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది.

click me!