96 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ వికాస్ సింగ్‌కి రజతం... వరుసగా మూడో ఎడిషన్‌లో కామన్వెల్త్ మెడల్ సాధించిన వికాస్ సింగ్...
కామన్వెల్త్ గేమ్స్‌లో ఐదో రోజు భారత్‌కి పతకాల పంట పండుతోంది. ఇప్పటికే ఐదో రోజు టీమ్ ఈవెంట్స్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన భారత్ ఖాతాలో మరో పతకాన్ని చేర్చాడు భారత వెయిట్‌లిఫ్టర్ వికాస్ ఠాకూర్. 96 కేజీల విభాగంలో పోటీపడిన వికాస్ సింగ్, స్నాచ్ రౌండ్‌లో 155 కేజీలు ఎత్తేశాడు... క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 191 కేజీలు ఎత్తిన వికాస్ ఠాకూర్, మొత్తంగా 346 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. వికాస్ ఠాకూర్‌కి ఇది వరుసగా మూడో కామన్వెల్త్ మెడల్. ఇంతకుముందు 2014లో రజతం గెలలిచిన వికాస్, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు..
స్వర్ణం సాధించిన సమోవాకి చెందిన డాన్ ఓపెలోగ్ మూడు రికార్డులు బ్రేక్ చేశాడు. స్నాచ్ రౌండ్‌లో 171 కేజీలు ఎత్తేసిన డాన్ ఓపెలోగ్, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 210 కేజీలు ఎత్తి పడేశాడు. దీంతో 381 కేజీలతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు... టాప్‌లో నిలిచిన డాన్‌కి, వికాస్ ఠాకూర్‌కి మధ్య 35 కేజీల తేడా ఉండడం విశేషం.
The 'V' in Vikas Thakur stands for victory! 🤩
Vikas Thakur adds another medal to India's tally at Commonwealth Games 2022 with a silver in men's 96Kg weightlifting with a total lift of 3️⃣4️⃣6️⃣Kg ! 🥈 🏋️ | pic.twitter.com/m9DXND9djQ
undefined
వికాస్ సింగ్ విజయంతో భారత పతకాల సంఖ్య 12కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో ఐదో స్వర్ణం చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన భారత పురుషుల టేబుల్ టెన్నిస్ టీమ్, ఫైనల్‌లో సింగపూర్‌పై విజయం సాధించి, వరుసగా రెండో ఏడిషన్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించింది...
డబుల్స్‌లో హర్మీత్ దేశాయ్- జీ సాథియన్ జోడి, సింగపూర్ డబుల్స్ జోడి యంగ్ ఇజాక్ క్వెక్- యో ఎన్ కోన్ పంగ్‌పై 13-11, 1-7, 11-5 తేడాతో విజయం సాధించి... టీమిండియాకి 1-0 తేడాతో ఆధిక్యం అందించింది. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత స్టార్ టీటీ ప్లేయర్ శరత్ కమాల్, తన ప్రత్యర్థి క్లెరెన్స్ చ్యూతో జరిగిన మ్యాచ్‌లో 11-7, 12-14, 11-3, 11-9 తేడాతో పోరాడి ఓడిపోయాడు...
దీంతో ఫైనల్ స్కోరు 1-1 తేడాతో సమం అయ్యింది. ఆ తర్వాత కొన్ పంగ్‌ని 12-10, 7-11, 11-7, 11-4 తేడాతో విజయాన్ని అందుకున్న జీ సాథియన్.. భారత్‌కి 2-1 తేడాతో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత హర్మీత్ దేశాయ్, క్లెరెన్స్ చ్యూతో జరిగిన మ్యాచ్‌లో 11-8, 11-5,11-6 తేడాతో విజయాన్ని అందుకుని 3-1 తేడాతో భారత టీటీ టీమ్‌కి గోల్డ్ మెడల్ అందించాడు...
అంతకుముందు ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు 1-3 తేడాతో పరాజయం పాలైంది. గ్రూప్ స్టేజీలో రెండు విజయాలు అందుకున్న భారత మహిళా హాకీ జట్టుకి ఇది తొలి పరాజయం. రేపు వరల్డ్ 15 ర్యాంకర్ కెనడాతో ఫైనల్ గ్రూప్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. టాప్ 2లో ముగించి నాకౌట్ స్టేజీకి అర్హత సాధించాలంటే రేపటి మ్యాచ్‌లో కచ్ఛితంగా విజయం సాధించాల్సి ఉంటుంది భారత జట్టు...
దానికి ముందు కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వుమెన్స్ లాన్ బౌల్స్ టీమ్ అద్భుతం చేసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా, పెద్దగా ఎవ్వరికీ పరిచయం లేని ఈవెంట్‌లో అంచనాలకు మించి రాణించిన భారత లాన్ బౌల్స్ టీమ్, ఫైనల్‌లో మూడు సార్లు ఛాంపియన్ టీమ్ సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి... స్వర్ణం కైవసం చేసుకుంది...