ప్రపంచ కప్: హార్డిక్ పాండ్యాపై క్లార్క్ మాట ఇదీ

Published : Jan 21, 2019, 10:56 AM IST
ప్రపంచ కప్: హార్డిక్ పాండ్యాపై క్లార్క్ మాట ఇదీ

సారాంశం

పాండ్యా వ్యాఖ్యలపై క్లార్క్ నేరుగా మాట్లాడలేదు. అయితే పాండ్యాకు పరోక్ష వ్యాఖ్యలతో మద్దతు తెలిపాడు. టాలెంటెడ్‌ ఆటగాడైన పాండ్యా భారత జట్టుకు చాలా అవసరమని, ఒంటరిగా మ్యాచ్‌లను గెలిపించే సత్తా పాండ్యాకు ఉందని అన్నాడు. 

సిడ్నీ: భారత క్రికెట్ హార్డిక్ పాండ్యా కచ్చితంగా 2019 ప్రపంచ కప్ ఆడుతాడని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖైల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో హార్దిక్ పాండ్యా సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. పాండ్యా భారత జట్టులో కీలక ఆటగాడని, జట్టు సమతూకంగా ఉండాలంటే పాండ్యా ఉండాల్సిందేనని క్లార్క్‌ అన్నాడు.

పాండ్యా వ్యాఖ్యలపై క్లార్క్ నేరుగా మాట్లాడలేదు. అయితే పాండ్యాకు పరోక్ష వ్యాఖ్యలతో మద్దతు తెలిపాడు. టాలెంటెడ్‌ ఆటగాడైన పాండ్యా భారత జట్టుకు చాలా అవసరమని, ఒంటరిగా మ్యాచ్‌లను గెలిపించే సత్తా పాండ్యాకు ఉందని అన్నాడు. 

పాండ్యా ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడుతాడని, ఎంత డబ్బు సంపాదించావనేది అనవసరమని ఆయన అన్నాడు. గౌరవ, మర్యాదలే ముఖ్యమని, పెద్దలను గౌరవించడం నుంచే ఇది అలవాటవుతోందని క్లార్క్ అన్నాడు. 

ఫ్రొఫెషనల్‌ ఆటగాళ్లు చాలా మందికి రోల్‌ మోడల్స్‌. వారిని అందరు గుర్తుపడుతారని, అందువల్ల వారంతా చాలా బాధ్యతగా వ్యవహరించాలని అన్నాడు. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారని, కానీ ఆ తప్పును గణపాఠంగా తీసుకొని ముందుకు సాగడమే చాలా అవసరమని పాండ్యాను ఉద్దేశించి పరోక్షంగా అన్నాడు.

పాండ్యా, కెఎల్ రాహుల్ లపై  విధించిన నిషేధాన్ని విచారణ పూర్తయ్యే వరకు ఎత్తివేయాల్సిందిగా బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ)కి లేఖ రాశారు. ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్‌నకు నాలుగు నెలలే ఉన్నందున వీరికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ అవసరమని, వర్ధమాన ఆటగాళ్లైనందున ఓ అవకాశం ఇద్దామని ఖన్నా అన్నారు. 

ఇప్పటికే వారు బేషరతుగా క్షమాపణలు చెప్పారని, విచారణ కొనసాగిస్తూనే, రాహుల్, పాండ్యాలను తక్షణమే జాతీయ జట్టులోకి తీసుకోవాలని సీఓఏను, బీసీసీఐ అధికారులను ఆయన కోరారు.

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !