అవును బెట్టింగ్‌కు పాల్పడ్డా: సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్

First Published 2, Jun 2018, 2:44 PM IST
Highlights

ఐపీఎల్‌లో బెట్టింగ్ నిజమే

ముంబై:వారం రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో  
బెట్టింగ్‌కు పాల్పడినట్టుగా ప్రముఖ సినీ నటుడు
సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ అంగీకరించారు.

మహరాష్ట్రలోని థానే పోలీసులు శనివారం నాడు
అర్భాజ్‌ఖాన్‌ను విచారించారు. విచారణకు హాజరైన
అర్భాజ్‌ఖాన్  బెట్టింగ్‌కు పాల్పడినట్టుగా అంగీకరించాడు. 
 
ఆరేళ్ల నుండి బుకీ  సోను తనకు తెలుసునని ఆయన
విచారణలో   ఒప్పుకొన్నారని తేలింది.

 సోను, అర్బాజ్‌ మధ్య జరిగిన చాటింగ్‌ సమాచారం,
బుకీలతో కలిసి వీరిద్దరు దిగిన ఫోటోలు తమ వద్ద
ఉన్నాయని పోలీసులు తెలిపారు. గతేడాది జరిగిన ఐపీఎల్‌
మ్యాచ్‌లో బెట్టింగ్‌ పెట్టి రూ.2.75కోట్లు నష్టపోయినట్లు
అర్బాజ్‌ ఖాన్‌ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.

ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం
ప్రధాన నిందితుడైన సోనుజలన్‌ అనే బుకీని పోలీసులు
అరెస్టు చేశారు. విచారణలో సోను అర్బాజ్‌ఖాన్‌ పేరును
బయటపెట్టాడు. బెట్టింగ్‌లో రూ.2.8కోట్లు కోల్పోయాడని,
ఇవ్వకపోవడంతో బెదిరించానని సోను పోలీసుల విచారణలో
వెల్లడించారు. బుకింగ్‌కు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై
మే 15న సోనుతో పాటు మరో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు
చేశారు.

జలన్ ను అరెస్ట్ చేసిన తర్వాత అతని వద్ద ఉన్న డైరీలో
కీలక సమాచారాన్ని సేకరించారు. 

ఈ సమాచారం ఆధారంగా పోలీసులు
విచారణసాగిస్తున్నారు. విచారణలో పలువురు కీలకమైన
వ్యక్తుల వివరాలను జలన్ వెల్లడించినట్టు సమాచారం.

Last Updated 2, Jun 2018, 2:45 PM IST