వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్ మ్యాచ్.. ఆడకుంటే మనకే నష్టం: బీసీసీఐ

By Siva KodatiFirst Published Feb 21, 2019, 8:40 PM IST
Highlights

రానున్న ప్రపంచకప్‌లో పాక్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను సైతం భారత్ బాయ్‌కాట్ చేయాలనే వాదనలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు మాజీలతో పాటు ప్రజలు కోరుతున్నారు. 

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై రగిలపోతున్న భారతీయులు ... ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలను వదులుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల మనోభావాల మేరకు పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ నుంచి ఐఎంజీ రిలయన్స్, డీస్పోర్ట్స్ సంస్థలు తప్పుకున్నాయి.

అలాగే రానున్న ప్రపంచకప్‌లో పాక్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను సైతం భారత్ బాయ్‌కాట్ చేయాలనే వాదనలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు మాజీలతో పాటు ప్రజలు కోరుతున్నారు.

అయితే దీనిపై బీసీసఐ ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, ప్రభుత్వం చెబితే పాక్‌తో ఆడబోయేది లేదని వెల్లడించింది. కానీ ఈ అంశంపై బీసీసీఐ పునరాలోచనలోపడింది.

పాలక కమిటీ, బీసీసీఐ మాత్రం మ్యాచ్ బాయ్‌కాట్ వ్యవహారాన్ని ఇంతవరకు ఐసీసీకి తెలియజేయలేదు. ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ రద్దు విషయాన్ని ఐసీసీని ఆశ్రయిస్తే తిరస్కరణకు గురవుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఐసీసీ రాజ్యాంగం ప్రకారం నిర్దేశించిన అన్ని జట్లు ఆడాల్సిందేనని, ఒకవేళ ఐసీసీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా పరిగణిస్తే తర్వాత టీమిండియాకే నష్టం కలుగుతుందన్నారు.

2021లో ఛాంపియన్స ట్రోఫీ, 2023 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని భారతదేశం కోల్పోవాల్సి వస్తుందన్నారు. పాక్‌తో మ్యాచ్‌ విషయంపై  శుక్రవారం పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ సమావేశమవుతారని ఆయన అన్నారు. 
 

click me!