అంపైర్ల జీతాలను భారీగా పెంచిన బిసిసిఐ : ఆటగాళ్ల కంటే ఎక్కువ

First Published May 31, 2018, 5:40 PM IST
Highlights

టాప్ 20 అంపైర్ల జీతాలు రెండింతలు

దేశవ్యాప్తంగా బిసిసిఐ చే గుర్తింపు పొందిన అంపైర్లకు భారీగా జీతాలు పెరిగాయి. బిసిసిఐ తాజాగా టాప్ 20 అంపైర్ల జీతాలను సవరించింది. దీని ప్రకారం దేశవాళీ ఆటగాళ్లకు ఇచ్చే వేతనం కంటే అంపైర్లకు ఇచ్చే జీతాలే ఎక్కువగా ఉండనున్నాయి. 

ప్రస్తుతం టీ20 లో తప్ప మిగతా మ్యాచుల్లో అంపైర్లకు రోజుకు రూ.20 వేలు ఇస్తున్నారు. ఆ జీతాన్ని ఇకనుంచి రోజుకు రూ.40 వేలుగా పెంచుతూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఇక టీ20 విషయానికి ప్రస్తుతం రోజుకు రూ.10 వేలు ఇస్తుండగా ఇకనుంచి రూ.20 వేలు ఇవ్వనున్నారు.

ఈ వేతనాల పెంపుతో అంపైర్లు దేశవాళీ క్రికెటర్ల కంటే ఎక్కువ జీతాలు పొందనున్నారు. ప్రస్తుతం ఒక్కో దేశవాళీ క్రికెటర్ కు రోజుకు రూ.35 వేలు లభిస్తున్నాయి. అయితే  క్రికెటర్లకు బిసిసిఐ లాభాల్లో కూడా వాటా ఇస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని క్రికెటర్లు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు.


 

click me!