ఒకే మ్యాచ్ లో రెండు ప్రపంచ రికార్డులు...అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లో

By Arun Kumar PFirst Published Nov 24, 2018, 8:42 PM IST
Highlights

ఒక  క్రికెటర్ ఒక మ్యాచ్ ఒక రికార్డును బద్దలుగొడితే అతడి ఆనందానికి అవదులుండవు. మీడియా, ప్రేక్షకులు అతన్ని ఆకాశానికెత్తుతాయి. అలాంటిది ఒకే మ్యాచ్లో రెండు ప్రపంచ రికార్డులు సాధిస్తే...అవికూడా బ్యాటింగ్, బౌలింగ్ వంటి రెండు వేరే వేరు విభాగాల్లో అయితే ఆ ఆనందానికి, ప్రశంసలకు హద్దే ఉండదు. అలాంటి ప్రశంసలే ఇప్పుడు షకీబుల్ హసన్ అందుకుంటున్నారు.  
 
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సీరిస్తో ఈ అరుదైన ఘనత సాధించాడు. చిట్టంగాంగ్ టెస్టులో షకీబ్ తన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో మెరిసాడు. ఈ మ్యాచ్ లో అతడు సాధించిన పరుగుల ద్వారా టెస్టుల్లో 3వేల పరుగుల మార్కును సాధించాడు. ఇలా టెస్ట్ చరిత్రలోనే అత్యంత తక్కువ ఇన్నింగ్సుల్లో వేగంగా 3వేల పరుగులను సాధించిన ఆటగాడిగా షకీబ్ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ బోథమ్  55 టెస్టుల్లో ఈ ఘనత సాధిస్తే షకీబ్ మాత్రం కేవలం 54 టెస్టుల్లోనే సాధించాడు. 

ఇక బౌలింగ్ విషయానికి వస్తే కేవలం 54 టెస్టుల్లోనే 200 వికెట్లు తీసిన అంతర్జాతీయ బౌలర్ గా షకీబ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.చిట్టంగాంగ్ మ్యాచ్ లో విండీస్ కెప్టెన్ బ్రాత్ వెట్ వికెట్ పడగొట్టడం ద్వారా ఈ మైలురాయిని సాధించాడు. ఇలా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఒకే మ్యాచ్ లో రెండు రికార్డులను బద్దలుగొట్టిన షకీబ్ క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు.   
 
click me!