పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా.. షోయబ్ ట్వీట్

Published : Oct 30, 2018, 09:47 AM ISTUpdated : Oct 30, 2018, 11:03 AM IST
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా.. షోయబ్ ట్వీట్

సారాంశం

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇంటికి కొత్తగా చిన్నారి అతిథి వచ్చాడు. 

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇంటికి కొత్తగా చిన్నారి అతిథి వచ్చాడు. షోయబ్ తాను తండ్రిని అయిన విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం సానియా ఆరోగ్యంగానే ఉందని, అందరి ఆశీస్సులు కావాలని షోయబ్ కోరారు. ‘నాకు ఎంతో ఆనందంగా ఉంది. కుమారుడు జన్మించాడు. సానియా ఎప్పటిలానే స్ట్రాంగ్ గా ఉంది’ అని షోయబ్ ట్వీట్ చేశారు.

కాగా.. సానియా, షోయబ్ అభిమానులు.. వారికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Lionel Messi : హైదరాబాద్ అభిమానులకు మెస్సీ స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ స్పీచ్ విన్నారా?
Lionel Messi : మెస్సీతో సై అంటే సై.. సీఎం రేవంత్ రెడ్డి రచ్చ.. ఎవరు గెలిచారు?