కోహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్

Published : Nov 05, 2018, 10:02 AM IST
కోహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్

సారాంశం

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ ని పాక్ క్రికెటర్ బాబర్ అజమ్ బ్రేక్ చేశాడు. 

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ ని పాక్ క్రికెటర్ బాబర్ అజమ్ బ్రేక్ చేశాడు. ఆదివారం పాక్ టీం.. న్యూజిలాండ్ తో టీ20 మ్యాచ్ లో పోటీపడింది. కాగా.. ఈ మ్యాచ్ లో బాబర్ 58 బంతుల్లో 78 పరుగులు సాధించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 48 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఈ ఓపెనర్‌.. అత్యంత వేగంగా ఈ ఘనతనందుకున్న క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. 

 అయితే.. టీం ఇండియా కెప్టెన్   కోహ్లి 27 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకుంటే.. బాబర్‌ 26 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించి అతని రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ 47 పరుగులతో విజయం సాధించి 3-0తో కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న బాబర్‌ తన ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. దీంతో.. ప్రస్తుతం క్రికెటర్లంతా జాబర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

WPL 2026 : ముంబై vs బెంగళూరు.. తొలి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ఫ్రీగా చూడాలంటే?
WPL: క్రికెట్ లవర్స్‌కు పండగే.. 28 రోజులు.. 22 మ్యాచులు.. గ్రౌండ్ దద్దరిల్లాల్సిందే!