ముగిసిన ఏషియా పారా గేమ్స్... 111 మెడల్స్‌తో భారత అథ్లెట్ల సరికొత్త చరిత్ర...

By Chinthakindhi Ramu  |  First Published Oct 28, 2023, 2:11 PM IST

పారా గేమ్స్‌లో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించిన భారత పారా అథ్లెట్లు... అత్యుత్తమ ప్రదర్శన నమోదు


హాంగ్జౌలో జరిగిన ఏషియన్ గేమ్స్ 2022 పోటీల్లో 107 పతకాలతో సరికొత్త చరిత్ర లిఖించిన భారత్.. పారా గేమ్స్‌లోనూ అద్భుతం చేసింది. పారా గేమ్స్‌లో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు భారత అథ్లెట్లు..

ఏషియన్ గేమ్స్, ఏషియా పారా గేమ్స్‌‌లో భారత్ ఖాతాలో 100కి పైగా పతకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. జాకార్తాలో 72 మెడల్స్ సాధించిన పారా అథ్లెట్లు, అంతకుముందు 2014 ఏషియా పారా గేమ్స్‌లో 33 మెడల్స్ సాధించారు..

Latest Videos

undefined

మొత్తంగా పథకాల పట్టికలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. చైనా 521 మెడల్స్‌తో టాప్‌లో ఉంటే ఇరాన్, జపాన్, కొరియా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.  హాంగ్జౌలో 17 క్రీడా విభాగాల్లో 309 మంది పారా అథ్లెట్లు, ఏషియా పారా గేమ్స్‌లో పాల్గొన్నారు. ఇందులో 12 మందికి ఐదో స్థానంలో నిలిచి, తృటిలో పతకాలను మిస్ చేసుకున్నారు..

మెన్స్ బీ1 పారా చెస్ ఈవెంట్‌లో దర్పన్ ఇరానీ గోల్డ్ మెడల్ సాధించాడు. పారా చెస్ ఈవెంట్‌లో భారత మహిళల టీమ్, భారత పురుషుల చెస్ టీమ్స్ కాంస్య పతకాలు సాధించాయి. 

పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ స్వర్ణం సాధించగాటెక్ చంద్‌కి కాంస్యం దక్కింది. 

click me!