ఏషియన్ గేమ్స్ 2023: క్వార్టర్ ఫైనల్‌లోకి భారత వాలీబాల్ టీమ్... చైనీస్ తైపాయ్‌పై సంచలన విజయం..

By Chinthakindhi RamuFirst Published Sep 22, 2023, 3:39 PM IST
Highlights

చైనీస్ తైపాయ్‌తో మ్యాచ్‌లో 3-0 తేడాతో సంచలన విజయం అందుకున్న భారత పురుషుల వాలీబాల్ జట్టు... జపాన్‌తో సెమీస్ రెఢీ.. 

ఏషియన్ గేమ్స్ 2023 టోర్నీలో భారత వాలీబాల్ జట్టు సంచలన విజయాలతో క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. మొదటి మ్యాచ్‌లో కంబోడియాని 3-0 తేడాతో ఓడించిన భారత పురుషుల వాలీబాల్ టీమ్, ఆ తర్వాత మ్యాచ్‌లో దక్షిణ కొరియాను 3-2 తేడాతో చిత్తు చేసింది..

తాజాగా చైనీస్ తైపాయ్‌తో మ్యాచ్‌లో 3-0 (25-22, 25-22, 25-21) తేడాతో విజయం అందుకున్న భారత జట్టు, క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. గత ఏషియన్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన చైనీస్ తైపాయ్ జట్టు, భారత జట్టు జోరు ముందు నిలవలేకపోయింది. భారత పురుషుల వాలీబాల్ టీమ్ ర్యాంకింగ్స్ 73 కాగా, చైనీస్ తైపాయ్ 43 వ ర్యాంకులో ఉంది..

రెండో మ్యాచ్‌లో 27వ ర్యాంకులో ఉన్న సౌత్ కొరియాపై సంచలనం క్రియేట్ చేసిన భారత పురుషుల వాలీబాల్ టీమ్, మరో రెండు విజయాలు అందుకుంటే పతకం ఖాయం చేసుకుంటుంది. అయితే క్వార్టర్ ఫైనల్‌లో భారత ప్రత్యర్థి జపాన్. పురుషుల వాలీబాల్ టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 5లో ఉన్న జపాన్‌ని ఓడించాలంటే భారత పురుషుల వాలీబాల్ టీమ్, అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది..

మహిళల క్రికెట్‌ పోటీల్లో భారత మహిళా క్రికెట్ జట్టు, సెమీ ఫైనల్‌కి ప్రవేశించింది. మలేషియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయ్యింది. దీంతో మెరుగైన సీడ్‌తో బరిలో దిగిన భారత మహిళా క్రికెట్ టీమ్, సెమీస్‌కి నేరుగా అర్హత సాధించింది.

NEWS FLASH:

Asian Games: India storm into QF of Men's Volleyball.

India BEAT higher ranked Chinese Taipei 3-0 (25-22, 25-22, 25-21).

World rankings: India: 73 | Chinese Taipei: 43 | | pic.twitter.com/L7RuFuv1vc

— India_AllSports (@India_AllSports)

ఇండోనేషియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కూడా ఈ విధంగానే ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు అయ్యింది. దీంతో మెరుగైన ర్యాంకులో ఉన్న కారణంగా పాక్, సెమీస్ చేరింది..

థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్- హంగ్‌కాంగ్ మధ్య మ్యాచ్ కూడా వర్షంతో రద్దు అయ్యింది. మెరుగైన ర్యాంకులో ఉన్న బంగ్లా, సెమీస్‌కి వెళ్లింది..

సెప్టెంబర్ 24న ఇండియా- బంగ్లాదేశ్ మధ్య సెమీ ఫైనల్ జరగనుంది. అదే రోజు పాకిస్తాన్- శ్రీలంకతో సెమీ ఫైనల్ 2 ఆడుతుంది. 

click me!