ఏషియన్ గేమ్స్ 2023 : ఇప్పటికి 91, భారత్‌‌కు ఖాయమైన మరో 9 పతకాలు..సెంచరీ మెడల్స్ క్లబ్‌లో బెర్త్ కన్ఫర్మ్

Siva Kodati |  
Published : Oct 06, 2023, 05:17 PM ISTUpdated : Oct 06, 2023, 05:18 PM IST
ఏషియన్ గేమ్స్ 2023 : ఇప్పటికి 91, భారత్‌‌కు ఖాయమైన మరో 9 పతకాలు..సెంచరీ మెడల్స్ క్లబ్‌లో బెర్త్ కన్ఫర్మ్

సారాంశం

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ మొత్తం 100 పతకాలు సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు మనదేశం అధికారికంగా 91 పతకాలను గెలుచుకుంది. మరో తొమ్మిది పతకాలకు కూడా ఇండియా చేరువైంది. 

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ మొత్తం 100 పతకాలు సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు మనదేశం అధికారికంగా 91 పతకాలను గెలుచుకుంది. మరో తొమ్మిది పతకాలకు కూడా ఇండియా చేరువైంది. ఆసియా క్రీడల చరిత్రలో 2023 ఎడిషన్ భారత్‌కు అత్యుత్తమైనది, అంతేకాదు మనదేశం పతకాల పట్టికలో మూడు అంకెల మార్క్‌ను చేరుకోవడం కూడా ఇదే తొలిసారి. మహిళల 62 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో సోనమ్ మాలిక్ కాంస్యం సాధించడంతో భారత్‌కు 100 పతకాలు ఖాయమయ్యాయి. 

భారత్‌ 100 మెడల్స్ మార్క్ చేరుకునేందుకు భరోసాగా వున్న 9 పతకాలు ఏంటో ఒకసారి చూస్తే:

కాంపౌండ్ ఆర్చరీ (3): శనివారం జరిగే పురుషుల ఫైనల్‌లో అభిషేక్ వర్మ, ఓజాద్ ప్రవీణ్ డియోటాలే ఒకరితో ఒకరు తలపడనున్నారు. జ్యోతి సురేఖ వెన్నం మహిళల ఫైనల్‌కు చేరుకుంది. తద్వారా భారత్‌కు మరో రెండు పతకాలు గ్యారెంటీగా దక్కనున్నాయి. 

కబడ్డీ (2): భారత పురుషుల, మహిళల జట్లు శనివారం జరిగే ఫైనల్స్‌కు చేరుకున్నాయి.

పురుషుల హాకీ (1): స్వర్ణ పతకం కోసం శుక్రవారం జరిగే ఫైనల్‌లో భారత్‌ జపాన్‌తో తలపడనుంది.

బ్యాడ్మింటన్ (1): శుక్రవారం జరిగే సెమీఫైనల్‌లో సాత్విక్ ‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సోహ్ వూయ్ యిక్‌లతో తలపడడంతో కనీసం కాంస్యం ఖాయమైంది.

పురుషుల క్రికెట్ (1): శనివారం జరిగే ఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

బ్రిడ్జ్ (1): భారత పురుషుల జట్టు శనివారం జరిగే ఫైనల్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. తద్వారా రజతం గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Rohit Sharma : షాకింగ్.. అసలు విషయం చెప్పిన రోహిత్!
కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?