Asia Games: చైనాను కబళిస్తున్న కరోనా.. ఆసియా క్రీడలు వాయిదా..

Published : May 06, 2022, 02:37 PM IST
Asia Games: చైనాను కబళిస్తున్న కరోనా.. ఆసియా క్రీడలు వాయిదా..

సారాంశం

Asia Games 2022 Postponed: దాదాపు ముగిసిందనుకున్న  కరోనా మళ్లీ మానవాళి మీదకు  పెను తుఫానులా దూసుకువస్తున్నది.  ఇప్పుడిప్పుడే  ప్రపంచం ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ కోరలు చాచుతున్నది.

చైనాలో పుట్టి  ప్రపంచమంతా విస్తరించిన  మాయదారి మహమ్మారి కరోనా మరోసారి భయపెడుతున్నది.  చైనాలో ఈ వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది.  దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ లో హాంగ్జౌ నగరంలో జరగాల్సి ఉన్న ఆసియా క్రీడలు-2022 ను వాయిదా వేశారు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఏఓసీ) నిర్వాహకులు. త్వరలో జరుగబోయే 19వ ఆసియా క్రీడలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.  ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు చైనాలోని హాంగ్జౌ నగరంలో  ఆసియా క్రీడలను నిర్వహించేందుకు చైనా సర్వ సన్నద్ధమైంది.  కానీ  హఠాత్తుగా మళ్లీ  కరోనా కేసుల పెరుగుదలతో ఆ ప్రయత్నాలను విరమించుకుంది. 

ఈ మేరకు ఏఓసీ  ఓ ప్రకటనలో స్పందిస్తూ.. ‘ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్న ఆసియా క్రీడలను వాయిదా వేస్తున్నాం. తదుపరి తేదీలను మరికొన్ని రోజుల్లో వెల్లడిస్తాం..’అని ఓ ప్రకటనలో పేర్కొంది. 

 

చైనాలోని షాంఘై నగరాన్ని  గత నెల రోజులుగా పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే.  ఆసియా క్రీడలను నిర్వహించాలనుకున్న హాంగ్జౌలో ఇప్పటికే  ఆసియా, పారా క్రీడల కోసం 56 వేదికలను కూడా రెడీ చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. అయితే  షాంఘై నగరంలో మాత్రం నెలరోజులుగా కఠిన లాక్డౌన్ అమలవుతున్నది.  కనీసం  ప్రజలు  ఇంటి కిటికీలు తీయడానికి వీళ్లేనంత నిర్బంధంగా  అక్కడ లాక్డౌన్ విధిస్తున్నట్టు వార్తాకథనాలు వెలువడుతున్నాయి. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !