ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి ‘విరుష్క’ ప్లాన్

Published : Nov 30, 2018, 10:50 AM ISTUpdated : Nov 30, 2018, 10:56 AM IST
ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి ‘విరుష్క’ ప్లాన్

సారాంశం

ఈ ప్రేమ జంట గతేడాది డిసెంబర్ 11వ తేదీన ఇటలీలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల మొదటి వెడ్డింగ్ యానివర్సరీ మరెంతో దూరంలో లేదు. ఈ ప్రేమ జంట గతేడాది డిసెంబర్ 11వ తేదీన ఇటలీలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత సెలబ్రెటీల కోసం ముంబయిలో ప్రత్యేకంగా రిసెప్ష్ కూడా ఏర్పాటు చేశారు.

పెళ్లి తర్వాత విరుష్క జంట... తమ కెరిర్ పై దృష్టి పెడుతూనే.. వ్యక్తిగతంగానూ తమ కోసం సమయం కేటాయిస్తూ వస్తున్నారు. కోహ్లీ విదేశాలకు వెళ్లినప్పుడు అనుష్క కూడా అతనితో వెళ్లడం లాంటివి చేశారు. మరో పది రోజుల్లో విరుష్క జంట మొదటి పెళ్లి రోజు రాబోతోంది. ప్రస్తుతం అనుష్క తాను నటించిన జీరో సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉండగా.. కోహ్లీ.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ కారణంగా అక్కడికి వెళ్లిపోయారు.

ఈ రెండింటిపై దృష్టిపెడుతూనే.. తమ యానివర్సరీ సంబరాలు చేసుకోవాలని ఈ జంట నిర్ణయించిందట. జీరో ప్రమోషన్స్ పూర్తి చేసుకోని కొద్ది రోజుల్లో అనుష్క కూడా ఆస్ట్రేలియా వెళ్లనుందట. అక్కడే ఇద్దరూ తమ మొదటి పెళ్లి రోజుని జరుపుకోవాలని అనుకుంటున్నారట. డిసెంబర్ 6 నుంచి టీం ఇండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. క్రికెటర్లంతా అక్కడే ఉంటారు కాబట్టి..వారి సమక్షంలోనే వీళ్ల యానివర్సరీ జరుపుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

గతేడాది వీరిద్దరి పెళ్లి జరగగా.. అప్పటి నుంచి వరసగా బాలీవుడ్ లో హీరోయిన్లు పెళ్లిబాట పట్టారు. వీరి తర్వాత సోనమ్, నేహాధూపియా, రీసెంట్ గా దీపికా పదుకోణె వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మరికొద్ది రోజుల్లో ప్రియాంక కూడా పెళ్లి పీటలు ఎక్కునున్నారు.  

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ