న్యూజిల్యాండ్ పర్యటనకు కోహ్లీతో పాటే అనుష్క...అభిమానుల సెటైర్లు (వీడియో)

Published : Jan 21, 2019, 06:15 PM ISTUpdated : Jan 21, 2019, 06:37 PM IST
న్యూజిల్యాండ్ పర్యటనకు కోహ్లీతో పాటే అనుష్క...అభిమానుల సెటైర్లు (వీడియో)

సారాంశం

ఆస్ట్రేలియాతో చారిత్రాత్మక విజయం తర్వాత మంచి ఊపుమీదున్న టీంఇండియా మరో సమరానికి సిద్దమైంది. ఈ  నెల 23వ తేదీ నుండి న్యూజిల్యాండ్‌లో మరో ప్రతిష్టాత్మక సీరిస్ ప్రారంభంకానుంది. అందుకోసం భారత జట్టు నేరుగా ఆస్ట్రేలియా నుండి న్యూజిల్యాండ్ కు బయలుదేరింది.   

ఆస్ట్రేలియాతో చారిత్రాత్మక విజయం తర్వాత మంచి ఊపుమీదున్న టీంఇండియా మరో సమరానికి సిద్దమైంది. ఈ  నెల 23వ తేదీ నుండి న్యూజిల్యాండ్‌లో మరో ప్రతిష్టాత్మక సీరిస్ ప్రారంభంకానుంది. అందుకోసం భారత జట్టు నేరుగా ఆస్ట్రేలియా నుండి న్యూజిల్యాండ్ కు బయలుదేరింది. 

ఇప్పటికే భారత జట్టు మొత్తం న్యూజిల్యాండ్‌లోని అక్లాండ్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆక్లాండ్ విమానాశ్రయంలో టీమిండియాకు ఘనస్వాగతం లభించింది. టీమిండియా ఆటగాళ్లు, సిబ్బందితో పాటు మరో అతిథి కూడా అక్లాండ్ కు చేరుకున్నారు. ఆమె ఎవరో కాదు టీంఇండియా సారథి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ. 

టీంఇండియా దాదాపు రెండు నెలల పాటు చేపట్టిన ఆస్ట్రేలియా పర్యటన కాలంలో కూడా అనుష్క తన భర్త కోహ్లీతో పాటే వుంది. చారిత్రాత్మక టెస్ట్ విజయం తర్వాత కోహ్లీ తన భార్యతో కలిసి మైదానంలో తిరుగుతూ సందడి  కూడా చేశాడు. తాజాగా  ఇప్పుడు అనుష్క న్యూజిల్యాండ్ కు కూడా చేరుకుంది. 

టీంఇండియా ఆటగాళ్లు, భర్త విరాట్ కోహ్లీతో పాటు అతని భార్య అనుష్క శర్మకు కూడా ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీనిపై భారత అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం జట్టుతో పాటు కోహ్లీ బాగా ఆడుతున్నారు కాబట్టి పరవాలేదు...ఏదైనా తేడా వస్తే నువ్వు (అనుష్క) బలైపోతావంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అనుష్క వెంటుండం వల్లే ఆస్ట్రేలియాలో భారత్ చారిత్రాత్మక విజయం అందుకుందంటూ ప్రశంసిస్తున్నారు.  

ఈ నెల 23వ తేదీ నుండి భారత్-న్యూజిల్యాండ్ ల మధ్య ఐదు వన్డేల సీరిస్ ప్రారంభంకానుంది. వచ్చే నెల 6 నుండి 3 టీ20 మ్యాచ్ ల సీరిస్ ప్రారంభమవుతుంది. వన్డే ప్రపంచ కప్ కు ముందు జరిగే ఈ సిరిస్ ను గెలిచి మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని టీంఇండియా భావిస్తోంది. 

వీడియో

 

 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !
Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?