అబద్ధం: కుండ బద్దలు కొట్టిన డివిలియర్స్

By pratap reddyFirst Published Aug 17, 2018, 7:03 PM IST
Highlights

విదేశాల్లో ఆడడంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఎబి డీవిలియర్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మే నెలలో అనూహ్యంగా ఆయన క్రికెట్ నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, తాను రిటైర్ అయినందుకు ఏమీ విచారించడం లేదని చెప్పాడు.

విదేశాల్లో ఆడడంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఎబి డీవిలియర్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మే నెలలో అనూహ్యంగా ఆయన క్రికెట్ నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, తాను రిటైర్ అయినందుకు ఏమీ విచారించడం లేదని చెప్పాడు.

తన కేరీర్ పై ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. విదేశాల్లో ఆడటాన్ని ఒత్తిడిగా భావించడం లేదని క్రిడాకారులు తరుచుగా చెప్పే విషయంపై ఆయన కుండ బద్దలు కొట్టాడు. నెలల తరబడి విదేశాల్లో సిరీస్‌లు, టోర్నీలు ఆడుతుంటే క్రికెటర్లు మాత్రమే కాదు, ఇతర క్రీడలు ఆడే ఆటగాళ్లు సైతం ఒత్తిడికి లోను కావడం అతి మామూలు విషయమని అన్నాడు. 

తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, స్వదేశంలో ఆడుతున్నట్లే భావిస్తానని ఏ ఆటగాడైనా చెబితే అతడు కచ్చితంగా అబద్ధం చెబుతున్నాడని అర్థమని అన్నాడు. ఒత్తిడికి గురైతే ఆటగాళ్లు త్వరగా అలసిపోతారని అన్నాడు.

కొన్నిసార్లు జట్టు ఎంపిక చిందరవందరగా ఉంటుందని, తాను దాదాపు రెండేళ్లపాటు (2016, 2017లో) టెస్ట్‌ ఫార్మాట్‌కు దూరమయ్యానని, అందుకు గాయాలు కూడా ఓ కారణమని అన్నాడు. ఈ ఏడాది భారత్‌, ఆస్ట్రేలియాలతో టెస్ట్‌ సిరీస్‌లలో మెరుగ్గానే ఆడానని భావిస్తున్నట్లు తెలిపాడు. 

దేశం, అభిమానులు, కోచ్‌లు ఆటగాళ్లపై ఎన్నో ఆశలు పెంచుకుంటారని, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన మ్యాచ్‌లలో శాయశక్తులా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని చూశాని చెప్పాడు. అయితే అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించడంపై ఎలాంటి బాధ లేదని అన్నాడు.

click me!