భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వాడేకర్ మృతి

By pratap reddyFirst Published Aug 16, 2018, 7:12 AM IST
Highlights

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ కన్ను మూశారు. చాలా కాలంగా ఆయన రుగ్మతతో బాధపడుతున్నారు. జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ కన్ను మూశారు. చాలా కాలంగా ఆయన రుగ్మతతో బాధపడుతున్నారు. జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. ఆయనకు భార్య రేఖ, ఇద్దరు కుమారులు, ఓ కూతురు నఅనారు. 

భారత క్రికెట్ జట్టుకు విదేశాల్లో రుచి చూపించింది ఆయనే. ఇంగ్లాండు, వెస్టిండీస్ ల్లో ఆయన నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు 1971లో విజయాలను అందుకుంది. 

టెస్టుల్లో ఆయన 2,113 పరగుులు చేశాడు. అందులో ఓ సెంచరీ ఉంది. ఆయన కేవలం 37 టెస్టు మ్యాచులు ఆడాడు. భారత క్రికెట్ జట్టు వన్డేల తొలి కెప్టెన్ కూడా ఆయనే. అయితే రెండు మ్యాచులు మాత్రమే ఆడారు. 

వాడేకర్ 1990 దశకంలో మొహమ్మద్ అజరుద్దీన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు భారత క్రికెట్ జట్టు మేనేజర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించారు .సెలెక్టర్స్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు. 

click me!