12 ఏళ్లకే చెస్‌ గ్రాండ్‌మాస్టర్... వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన అభిమన్యు మిశ్రా...

By Chinthakindhi Ramu  |  First Published Jul 1, 2021, 11:54 AM IST

 రష్యా ప్లేయర్ సర్జీ కర్జకిన్ 19 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన అభిమన్యు మిశ్రా...

15 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ లియోన్ లూక్ మెన్డోకాను ఓడించి, అతిచిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ కైవసం...


చదరంగ క్రీడా ప్రపంచంలో అభిమన్యు మిశ్రా పేరు మార్మోగిపోతోంది. పట్టుమని 12 ఏళ్లు కూడా పూర్తిగా నిండకుండానే గ్రాండ్ మాస్టర్‌గా అవతరించి, సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు అభిమన్యు మిశ్రా...

15 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ లియోన్ లూక్ మెన్డోకాను ఓడించిన అభిమన్యు మిశ్రా... 19 ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ చేశాడు. 2002, ఆగస్టు 12న గ్రాండ్‌ మాస్టర్‌గా అవతరించిన రష్యా ప్లేయర్ సర్జీ కర్జకిన్, 12 ఏళ్ల 7 నెలల వయసులో గ్రాండ్‌ మాస్టర్‌గా అవతరించి రికార్డు క్రియేట్ చేశాడు.

Latest Videos

undefined

19 ఏళ్ల తర్వాత అతని రికార్డును ఇండియా చిన్నోడు బ్రేక్ చేశాడు. 2009, ఫిబ్రవరి 5న జన్మించిన అభిమన్యు మిశ్రా వయసు 12 ఏళ్ల 4 నెలల 25 రోజులు...

కొన్ని నెలలుగా హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ఉంటున్న అభిమన్యు మిశ్రా, వరుస టోర్నీల్లో పాల్గొంటూ రికార్డు సాధించేందుకు ప్రయత్నించాడు. ఏప్రిల్, మే నెలల్లో జరిగిన టోర్నీమెంట్లలో గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను మిస్ అయిన అభిమన్యు, ఎట్టకేలకు చివరి ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకున్నాడు.

click me!