విరాట్ కోహ్లీపై బిషన్ సింగ్ విమర్శలు

By ramya neerukondaFirst Published Nov 20, 2018, 4:27 PM IST
Highlights

కోహ్లీ..తాను అనుకున్నదే జరగాలనుకుంటాడని, ఇతరుల మాటలకు  అస్సలు విలువ ఇవ్వరని  ఆయన మండిపడ్డారు.
 

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పై స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేదీ విమర్శల వర్షం కురిపించారు. కోహ్లీ..తాను అనుకున్నదే జరగాలనుకుంటాడని, ఇతరుల మాటలకు  అస్సలు విలువ ఇవ్వరని  ఆయన మండిపడ్డారు.

కోహ్లీ ఏం చేసినా అందరూ చూస్తూ ఉండాలే తప్ప.. అతన్ని ఏమీ అనడానికి లేదు అంటూ ఆయన విమర్శలు చేశారు. తాజాగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విరాట్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 

‘‘జట్టులోని ఓ వ్యక్తి(కోహ్లీ) తాను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. కానీ కెప్టెన్ గా జట్టును నడిపించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. టీంలోని సభ్యులందరి అభిప్రాయాలను తెలుసుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. కానీ కోహ్లీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తాడు. వీటన్నింటిని మనం చూస్తూ ఉండాలంతే. ఈ స్వభావాన్ని అతను విడనాడితే మంచిది. అతని ప్రవర్తన కారణంగానే కోచ్‌గా అనిల్‌ కుంబ్లే రాజీనామా చేయాల్సి వచ్చింది’ అని బేదీ ఆరోపించాడు.

ఇక ఐపీఎల్ మ్యాచుల గురించి మాట్లాడుతూ.. వాటికి మించిన పెద్ద స్కామ్ ఏదీ లేదు అని అభిప్రాయపడ్డారు. బ్లాక్ మనీకి ఐపీఎల్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. 

click me!