చాలా మంది ఇక్కడ 'కోటి' అంటే సంఖ్య అనుకొన్నారు. ఎవరైనా 33 కోట్ల పేర్లను చెప్పమని అడిగితే ..? అవును ఇంతకీ వార్ల పేర్లు ఏమిటీ ..ఎవరు వారు అని సందిగ్ధంలో పడుతుంటాం.
వేదపురాణములు తెలుపునవి త్రయత్రింశతి కోటి (33 కోటి ) దేవతలు మరియు వారి పేర్లు మరియు హిందూ ధార్మిక సాహిత్య మందు తెలియజేయబడిన 33 కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమి అనగా ..?
undefined
చాలా మంది ఇక్కడ 'కోటి' అంటే సంఖ్య అనుకొన్నారు. ఎవరైనా 33 కోట్ల పేర్లను చెప్పమని అడిగితే ..? అవును ఇంతకీ వార్ల పేర్లు ఏమిటీ ..ఎవరు వారు అని సందిగ్ధంలో పడుతుంటాం. వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే కోటి కాదు. సంస్క్రతములో 'కోటి' అనగా 'విధము' 'వర్గము' (type) అని అర్థమూ ఉంది.
ఉదా: ఉచ్ఛకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం. అలాగే మరియు ఉదాహరణము:- సప్త కోటి బుద్ధులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్ధులు.
యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను తెలియజేసాయి. వీరే త్రయత్రింశతి కోటి (33 కోటి) దేవతలు.
హిందూ గ్రంధములేకాదు బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి తెలుపుతాయి. బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ప్రస్తావన ఉన్నది.
ఇపుడు దేవతల ఈ 33 వర్గములనూ... అందులో వచ్చు దేవతల పేర్లనూ చూద్దాము:- వసువులు 8, రుద్రులు 11, ఆదిత్యులు 12 మొత్తం కలిపితే ముప్పది ఒకటి. వీటితో పాటు ఇంద్రుడు , ప్రజాపతి అనే ఇద్దరితో కలిపి 33 అవుతుంది.
ద్వాదశాదిత్యులు :-
1. త్వష్ట,
2. పూష.
3.వివస్వాన్
4. మిత్ర
5. ధాతా
6. విష్ణువు
7. భగ.
8. వరుణ
9. సవిత
10. శక్ర
11.అంశ
12. ఆర్యమ.
ఏకాదశ రుద్రులు :-
1. మన్యు
2. మను
3. మహినస
4. మహాన్
5. శివ
6. ఋతధ్వజ
7. ఉగ్రరేతా
8. భవ
9. కాల
10. వామదేవ
11. ధృతవృత.
అష్టవసువులు :-
1. ధరా
2. పావక
3. అనిల
4. అప
5. ప్రత్యుష
6. ప్రభాస
7. సోమ
8. ధ్రువ.
మరి ఇద్ధరు:- 1. ఇంద్ర, 2. ప్రజాపతి.
వీరే త్రయత్రింశతి 33 కోటి దేవతలు. దైవము అంటే దివ్యత్వము కలిగిన వారని అర్థం. అంటే వారికి మనలాగ భౌతికంగా కనిపించే రూపాలు వుండవు. వారు దివ్యమైన శక్తి సంపన్నులు. ఆ శక్తుల ద్వారా సృష్టిలోని సమస్తాన్ని రక్షించడమే వారి కర్తవ్యం. సరస్వతీ దేవి వాక్కుకి అధిష్ఠాన దేవతయై వాక్కుని, సమస్త వాఙ్మయాన్ని రక్షిస్తుంది. లక్ష్మీ దేవి సంపదకు, పార్వతీదేవి సౌభాగ్యానికి అధిదేవతలు. కాబట్టి ఇంతమంది దేవతలా అనుకునే బదులు ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క విభాగానికీ ఒక్కొక్కరినీ అధిష్ఠాన దేవతలుగా భావించి ఆరాధించడంమే సనాతన ధర్మం యొక్క విశిష్టత.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151