గుళ్ళో శఠగోపనంతో ఫలితమేమిటి

By telugu news team  |  First Published Jan 9, 2021, 1:45 PM IST

మన పుణ్యభూమి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి వాటి పోషణార్థం మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

undefined

మన భారతదేశం వేద నాగరికత గల గొప్ప చరిత్రతో కూడిన పురాతన దేశం. చరిత్రను అనుసరిస్తే ఇక్కడ అడుగడుగునా అనేక దేవాలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మశక్యం కాని రహస్యాలతో ముడిపడి ఉండడం విశేషం. సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాల గురించి చాలా విషయాలున్నాయి, ప్రతి పురాతన ఆలయం వెనుక ఒక్కో ఆసక్తికర కధ ఉంటుంది.

మన పుణ్యభూమి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి వాటి పోషణార్థం మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేతనే పరమతస్థులు తమ దండ యాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచుకొని కొల్లగొట్టారు. 

దేవాలయాల వలన వ్వక్తికి, సమాజానికి, దేశానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి వలన భక్తి భావన పెరిగి, సామాజికంగా ఐకమత్య భావన పెరిగి తద్వారా దేశ భక్తి కలిగి, ముఖ్యంగా ప్రజల మానసికోల్లాసానికి ఉపయోగ పడుతుంది. ఈ భావన వలన అటు వ్వక్తులకు ( ప్రజలకు ) ఇటు దేశానికి ( సమాజానికి ) ఆరోగ్య కరమైన అభివృద్ధి కలుగుతుంది. దేవాలయంలో దైవ దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపనం తప్పక తీసుకోవాలి.

షడగోప్యమును శఠగోపనం అని కూడా అంటారు. శఠగోపనం అంటే అత్యంత రహస్యం. శఠగోపంను వెండి, రాగి, కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలుంటాయి. మన కోరికే శడగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. 
మనసులోని కోరికను స్మరించుకోండి. షడగోప్యమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వార శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. 

శడగోప్యం అంటే అత్యంత గోప్యామైనది అని అర్థం.  అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా మనస్సులో ఉన్న కోరికను తలుసుకోవాలి. అంటే మీ కోరికే శఠగోపనం. మానవునికి శత్రువులైన 1. కామము, 2. క్రోధము, 3. లోభము, 4. మోహము, 5. మదము, 6. మాత్సర్యముల అనే ఆరు చెడు గుణాల నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవడము మరో అర్థం.

శఠగోపనం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి అని అంటారు. ఎదో కారణం చేతనే మనకు మన పుర్వీకులైన పెద్దలు  కొన్ని పద్దతులను సూచన చేసారు. మనకున్న ప్రతీ ఆచార వ్యవహారాలలో అంతరార్ధ మరమార్ధం దాగిఉంటుంది.
 

click me!