పెళ్లి ఆలస్యమౌతుందా..? హనుమను ఇలా పూజిస్తే..

By telugu news team  |  First Published Jan 5, 2021, 8:45 AM IST

పెళ్ళి చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావడానికి బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

undefined

సమస్త సమస్యలకు ఆంజనేయస్వామికి 41 ( మండలం ) రోజులు నియమంగా పూజ చేయాలి. అందులో కొన్నింటి గురించి ఈ క్రింద వివరించ బడినది. 

1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు ఆవనూనెతో దీపారాధన చేస్తే  – ఆరోగ్యం కలుగుతుంది.

2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం – ఈ ఐదింటిని పిండి చేసి దీపప్రమిదగా చేసి అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

3. పెళ్ళి చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావడానికి బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

4. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

5. కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి.

6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి కందిపిండి మరియు బెల్లంతో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.

7. దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి.

8. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి, దాంతో దీపారాధన చేయాలి.

గమనిక : – ఈ పరిహారాల్లో దేన్నైనా ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు. హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతి బాధలు తొలగిపోతాయ. శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడు, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే.. వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయి.

* ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటుంది. హనుమంతుని గుడికి వెళ్ళిన వారు అక్కడ ఉన్న రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చెట్టును ముట్టుకోకుండా 'ఓం నమో భగవతే వాసుదేవాయ" అని స్మరిస్తూ తప్పక ప్రదక్షిణలు చేయాలి. అవకాశం ఉన్న వారు ఈ చెట్టు దగ్గర పై తెలిపిన దీపారాధన ఇక్కడ కూడా చేయాలి. చెట్టు మొదల్లలో పంచదార చల్లాలి. నీళ్ళు, పూలు, అగరొత్తులు మొదలైన వాటితో భక్తితో చిత్త శుద్దిగా పూజిస్తే మంచి ఫలితాలను పొందుతారు. 


 

click me!