ఇంట్లో సిరి నిలవడం లేదా..? ఐశ్వర్యకాళీ దీపం పెడితే..

By telugu team  |  First Published Jan 22, 2020, 12:07 PM IST

నెలకొకసారి ఆఫీసు సింహద్వారానికి బూడిద గుమ్మడి కాయ లేదా పూజించిన కొబ్బరికాయ ఎర్రని రంగు వస్త్రంలో వేలాడదీయడం మంచిది.  కనీసం వారానికి ఒకసారన్నా సాంబ్రాణి ధూపం వేయండి. నరదృష్టి తొలిగిపోతుంది. 


ఐశ్వర్యా దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారో తెలుసుకుందాము. అనారోగ్య వాతావరణంలా ఉన్న ఆఫీస్ లేదా ఇల్లు కళ మారాలంటే మీ కార్యాలయాలలో భోజపత్ర యంత్ర యుక్తమైన గోమాత, పంచభూత,శక్తి పీఠ యంత్ర సహిత ఐశ్వర్య కాళీ పాదుకలు ఉన్న ఫోటో పెట్టండి సకల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయి. ఈశాన్య ములలో రాగి చెంబులో నీళ్ళను నిడుగా నింపి అందులో ఎర్రని పుష్పాలను వేసి అందులో కొంచం పసుపు, కుంకుమ వేసి ఈశాన్య దిశగా ఉంచండి. కాని ప్రతిరోజు వాటిలో నీరుని, పుష్పాలను క్రమం తప్పక మార్చాలి.

నెలకొకసారి ఆఫీసు సింహద్వారానికి బూడిద గుమ్మడి కాయ లేదా పూజించిన కొబ్బరికాయ ఎర్రని రంగు వస్త్రంలో వేలాడదీయడం మంచిది.  కనీసం వారానికి ఒకసారన్నా సాంబ్రాణి ధూపం వేయండి. నరదృష్టి తొలిగిపోతుంది. 

Latest Videos

undefined

మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా, వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంటుంది, అప్పులు తీరకుండా వడ్డీలు పెరిగి పోతూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబంధులు ఉన్నవారికి అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టివళ్ళ సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కోత్తగా ఎదైనా వ్యాపారం మొదలు పెట్టిన వారికి అభివృద్ధి కి అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం " ఉప్పు దీపం " మంచి పరిహారం...

ఎలా పెట్టాలి :-
ప్రతి శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకొని వాటికి పసుపు, కుంకుమా రాసి  నెలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమిధలు ఒకదాని పైన ఒకటి ఒక్కటిగా పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిధలు ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపు, కుంకుమా పూలు పెట్టి ప్రమిధలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి. 

దీపం శ్లోకం చదువుకోవాలి. పళ్ళు కానీ, పాలు , పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి  లక్ష్మీ వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి. కనకధార స్త్రోత్రం కూడా చదివితే మంచిది...

శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిధలులోని ఉప్పును తీసి  నీటిలో కలపాలి, వీలు పడని వారు ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోయాలి. నీళ్ళలో వేయడమే సరైన పద్దతి. అవకారం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు, ప్రమిధలు మాటి మాటికి కొత్తవి మార్చాల్సిన పని లేదు ప్రతి వారం అవి వాడుకోవచ్చు, ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి. ఆ తర్వాత ఆవునకు అరటిపండ్లు, తోటకూర లేదా పచ్చి గడ్డి ఆహారంగా ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేయాలి. 

ఇలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ సంకల్పం అనుకోని ఇంట్లో చేయాలి ఈ ఉప్పు దీపం ఈశాన్యం భాగంలో పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది, అంటే పూర్తీ ఈశాన్యం మూలకు కాకుండా కొంత దగ్గరలో ఉండేలా చూసుకోవాలి. 41 శుక్రవారం ఉప్పు దీపం పెట్టే వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, ధన ఇబ్బందులు తొలగిపోతాయి. కొందరు రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం. తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న చెట్లకు బకెట్ నీళ్ళలో వేసి కలిపి కరిగాక చెట్లకు కుడా పోయవచ్చును, సౌకర్యం లేని వారికి ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

click me!