గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

By telugu news team  |  First Published Oct 25, 2022, 2:05 PM IST

సాధారణంగా గ్రహణ సమయంలో ఉపవాసం ఉండాలని చెబుతారు. దీనికి కారణం ఈ సందర్భంలో ప్రకృతిలో బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువగా ఉంటుంది.


ఈరోజు అంటే అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం.  సూర్యుడికి  భూమికి మధ్య లోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది.  అయితే... గ్రహాల విషయంలో మనకు  చాలా అపోహలు ఉంటాయి. ఈ ఏడాది సూర్య గ్రహణం.. దీపావళి పండగ తర్వాతి రోజు వచ్చింది. 

సాధారణంగా గ్రహణ సమయంలో ఉపవాసం ఉండాలని చెబుతారు. దీనికి కారణం ఈ సందర్భంలో ప్రకృతిలో బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అవి ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. ఇది, తినేవారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. కాబట్టి సాంప్రదాయకంగా, భారతదేశంలోని హిందువులు ఆయుర్వేదం ఆధారంగా ఆహార నియంత్రణలను అనుసరిస్తారు.

Latest Videos

undefined

దీని ప్రకారం, గ్రహణ సమయంలో, ఎవరైనా వంట చేయడం లేదా ఆహారం తినడం, నీరు త్రాగడం లేదా ఆరుబయట వెళ్లడం మానుకోవాలి. కొందరు వ్యక్తులు ఈ కాలంలో తమను తాము దాని హానికరమైన ప్రభావాల నుండి రక్షించుకోవడానికి మంత్రాలను జపించడం లేదా దేవుడిని ప్రార్థించడం నమ్ముతారు. గ్రహణం తర్వాత, చాలా మంది ప్రజలు తమను తాము శుభ్రపరచుకోవడానికి.. స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరిస్తారు.

విశ్వంలో ఏమి జరుగుతుందో మానవ శరీరానికి సంబంధం ఉంటుంది. సూర్యగ్రహణం సమయంలో, అయస్కాంత క్షేత్రాలు, UV రేడియేషన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.  మన జీవక్రియ, జీర్ణక్రియ బలహీనంగా మారుతుంది. అందుకే ఈ సమయంలో ఆహారం తీసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. మీరు గ్రహణం సమయంలో సంప్రదాయ మార్గదర్శకాలను అనుసరించాలని ఎంచుకుంటే, మీరు గుర్తుంచుకోవలసినది ఇక్కడ ఉంది...

గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. కానీ తేలికైన, సత్వగుణమైన ఆహారాన్ని అంటే సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినవచ్చు. అది కూడా  వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, చిన్న పిల్లలు, గర్భిణీ రోగులు మాత్రం తినవచ్చట. UV కిరణాలు పిండానికి హాని కలిగిస్తాయి కాబట్టి సూర్యగ్రహణం సమయంలో మహిళలు బయటికి వెళ్లవద్దని ఆయుర్వేదం సిఫార్సు చేస్తోంది.

గ్రహణ సమయంలో నీరు త్రాగడానికి కూడా దూరంగా ఉండాలి. తర్వాత తాగడానికి నీళ్లు పట్టుకోవాల్సి వస్తే సరిపడా తులసి, వేప, దర్భ వేసి డబ్బాలో మూత పెట్టాలి.
మాంసం, రొట్టె, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఆల్కహాల్ లేదా పులియబెట్టిన ఆహారాలు, జీర్ణం కావడానికి కష్టమైన ఆహారాలు గ్రహణం సమయంలో లేదా తర్వాత తినకూడదు.
పండగకు ముందుగా తయారుచేసిన పిండి వంటలు ఉంటే సరిపడా దర్భ, తులసి ఆకులను డబ్బాలో వేయాలి. గ్రహణానికి ముందు ఇలాంటి స్నాక్స్ చేయకపోవడమే మంచిది.


గ్రహణానికి ముందు తయారుచేసిన ఆహారాన్ని తర్వాత తినకూడదు. గ్రహణం తర్వాత స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి కూరగాయలు, పండ్లను శుభ్రం చేసి బాగా ఉడికించాలి.
గ్రహణం తర్వాత తేలికగా జీర్ణమయ్యే పండ్లు, కూరగాయలు, అన్నం గంజి తినడం ద్వారా ఆహారం నెమ్మదిగా ప్రారంభించండి. కాబట్టి గంజి లేదా ఏదైనా తేలికపాటి ఆహారాన్ని వండేటప్పుడు దానికి పసుపు,తులసిని ఎక్కువ జోడించండి.
 

click me!