వాస్తు పరంగా ప్రధాన ద్వారం నిర్మించుకోవడానికి పై సూచించిన దిక్పాలకులను దృష్టిలో పెట్టుకుని ఇంటి ప్రధాన గుమ్మాన్ని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా దిక్కులకు గల సహజ బలం ఎలా ఉంటుందో క్రింది ఇవ్వబడిన దానిని గమనించండి.
దిక్కులు - దిక్పాలకులు - అధిపతులు
తూర్పు - ఇంద్రుడు - రవి ( సూర్యుడు)
పడమర - వరుణుడు - శని
దక్షిణం - యముడు - కుజుడు
ఉత్తరం - కుభేరుడు - బుధుడు
ఈశాన్యం -ఈశ్వరుడు - గురువు
వాయవ్యం - వాయుదేవుడు - చంద్రుడు
నైరుతి - నిరృతి అనే రాక్షసుడు - రాహు, కేతు
ఆగ్నేయం - అగ్నిదేవుడు - శుక్రుడు
వాస్తు పరంగా ప్రధాన ద్వారం నిర్మించుకోవడానికి పై సూచించిన దిక్పాలకులను దృష్టిలో పెట్టుకుని ఇంటి ప్రధాన గుమ్మాన్ని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా దిక్కులకు గల సహజ బలం ఎలా ఉంటుందో క్రింది ఇవ్వబడిన దానిని గమనించండి.
undefined
ఉత్తరం :- ఐశ్వర్య, భోగ భాగ్య కారకుడు. సకల సంపత్కరుడు. ధనాధిపతి కుబేరుడు.
ఈశాన్యం:- ఈశాన్య దిక్పతి. మృత్యుంజయుడు. సకల శుభకారకుడు. వంశోద్ధీపకుడు - శివుడు.
తూర్పు :- క్షత్రియ సంభవుడు. దర్పం కీర్తి కారకుడు. రాజస గుణాధిక్యత కలవాడు. ఇంద్రుడు.
వాయవ్యం :- అస్తిరత్వం ఎక్కువ. చంచలబుద్ధి. స్థాన భ్రష్ఠత్వం కలిగించే గుణం కలవాడు వాయుదేవుడు.
పశ్చిమం:- పాశంతో బంధించి, పురుషులకు తక్కువ సామర్థ్యాన్ని ఇచ్చేవాడు. వరుణుడు.
ఆగ్నేయం :- దురహంకారి. సర్వదగ్ధ సమర్థుడు. ధన లేమి కారకుడు రోగ కారకుడు - అగ్నిదేవుడు.
దక్షిణం:- మృత్యు కారకుడు. వినాశకుడు. దరిద్ర కారకుడు. సమపర్తి. ధనహీనుడు యముడు.
నైరుతి: నర వాహనుడు. రాక్షసుడు. పీడాకారకుడు. రక్తపాన మత్తుడు. హింసాకారకుడు నైర్పతి.
గమనిక :- పై ఎనిమిది దిక్కులలో మొదటి మూడు దిక్పాలకులు శుభ కారకులు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151