రేపే చంద్రగ్రహణం... శ్రీవారి ఆలయం మూసివేత..!

By telugu news teamFirst Published Nov 7, 2022, 10:27 AM IST
Highlights

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం అంటారు.

మొన్ననే సూర్య గ్రహణం అయిపోయింది. కాగా...  మళ్లీ చంద్ర గ్రహణం రానుంది. ఈ నవంబర్ 8 తేదీన చంద్రగగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది చివరి గ్రహణం ఇదే కావడం గమనార్హం. ఈ రోజున సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం అంటారు. కాగా... ఈ గ్రహణం రోజున చంద్రుడు...  ఎర్రగా కనిపించనున్నాడు. దీనినే బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు.

ఈ నవంబర్ 8 పూర్తి చంద్ర గ్రహణం, వాస్తవానికి, మూడేళ్లలో చివరి సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం. మార్చి 2025లో, తదుపరి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 

కాగా.... ఈ గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. ఈ కారణంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 

ఇందులో భాగంగా సోమవారం ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టంచేసింది. మంగళవారం మఽధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. చంద్రగ్రహణం కారణంగా శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి.. శుద్ధి చేశాక సర్వదర్శనాలను ప్రారంభిస్తారు.
 

click me!