పెళ్లిలో ఈ పొరపాట్లు... దంపతుల జీవితంలో ఇక్కట్లు

By telugu news team  |  First Published Mar 18, 2020, 11:24 AM IST

ఆధునికత అనే పేరుతో పరదేశపు విష సంస్కృతీ మోజులో పడి అగోచర గమ్యంలో కొట్టు మిట్టాడుతూ మన శాస్త్ర విలువలను మరచి అదోగతి పాలై తను సుఖంగా ఉండలేక, తలిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రశాంతత లేని జీవనం సాగించడానికి గల కారణాలు ఏమిటో గమనిద్దాం


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

undefined

ఎడడుగుల బంధం ఎంత పవిత్రమైనదో మన సనాతన ధర్మాలు, ఋషులు మనకు తెలియజేసారు. ఆధునికత అనే పేరుతో పరదేశపు విష సంస్కృతీ మోజులో పడి అగోచర గమ్యంలో కొట్టు మిట్టాడుతూ మన శాస్త్ర విలువలను మరచి అదోగతి పాలై తను సుఖంగా ఉండలేక, తలిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రశాంతత లేని జీవనం సాగించడానికి గల కారణాలు ఏమిటో గమనిద్దాం ఏడడుగుల బంధానికి ఏడు సూత్రాలు తెలియజేయడం జరుగుతుంది.     

1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..

ఫలితం:- దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం, చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం, భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం.

2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం.

ఫలితం:- దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం. వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం,ఫోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి.

3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం.

ఫలితం:- దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం.

4. తలంబ్రాలకు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం.

ఫలితం:- దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు.

5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం.

ఫలితం:- దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం.

6. బఫే భోజనాలు.

ఫలితం:- దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.

7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం.

ఫలితం:- దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం.

ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి. శాస్త్రీయమైన ఒక మంచి విషయం అందరికి తెలియజేయండి, చెప్పకపోతే తప్పు మనది అవుతుంది, చెప్పినా వారు పాటించక పోతే వాల్ల కర్మ. ఇవన్ని శాస్త్రంలో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు. వాటిని పాటించకుండా ఉంటే ఏమి జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. అందరూ భారతీయ హిందు వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం నెరవేరేటట్లుగా ఇతరులకు తెలియజేస్తూ, మీరూ సధర్నాన్నిఆచరింపచేస్తారని ఆశిస్తూ...జై శ్రీమన్నారాయణ.


 

click me!