పరమ పవిత్రమైన రుద్రాక్ష ధరించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది. ప్రతికూల శక్తులు కూడా దూరమవుతాయి. రుద్రాక్షను క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో ధన, ధాన్యాల కొరతనేది ఉండదు.
రుద్రాక్షకంకణలసత్కరదండయుగ్మః
ఫాలాంతరాలధృతభస్మసితత్రిపుండ్రః
పంచాక్షరం పరిపఠన్ వరమంత్రరాజం
ధ్యాయన్ సదా పశుపతిం శరణం వ్రజేథాః
undefined
రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని (శివుడు) అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. రుద్రాక్ష అనగా మాగ్నోలియోఫైటాకు చెందిన చెట్టు. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు లాంటివారు వీటిని ధరిస్తారు. ధరించుట వీలుకాని వారు పూజా గృహముల యందు పెట్టుకుని పూజించుట ఉత్తమం.
రుద్రాక్షలలో పలు రకాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు కోడిగుడ్డు, ఒక కాయ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుచించుకుంటూ గుండ్రముగా మారుతాయి. దీని మధ్య భాగమున కల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మధ్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది.
పరమ పవిత్రమైన రుద్రాక్ష ధరించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది. ప్రతికూల శక్తులు కూడా దూరమవుతాయి. రుద్రాక్షను క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో ధన, ధాన్యాల కొరతనేది ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో రుద్రాక్షను ధరించకూడదు. మన హిందూ సనాతన ధర్మంలో రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రుద్రాక్షను శివునిలో భాగంగా భావిస్తారు. ఆధ్యాత్మిక, దైవిక శక్తులతో నిండి ఉన్నదిగా పరిగణిస్తారు. రుద్రాక్ష శివుని కన్నీటి నుంచి ఉద్భవించిందని విశ్వసిస్తారు.
సతీదేవి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కన్నీళ్లు భూమిపై చాలా ప్రదేశాల్లో పడ్డాయి. ఆ కన్నీరు ఎక్కడైతే రాలాయో అక్కడ ప్రకృతి రుద్రాక్ష రూపంలో ఓ అద్భుత అంశాన్ని పొందింది. రుద్రాక్ష ధరించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు కూడా దూరమవుతాయి. రుద్రాక్షను క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో ధన, ధాన్యాల కొరతనేది ఉండదు. కొన్ని సందర్బాలలో రుద్రాక్షను ధరించకూడదు. లేకుంటే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని పురాణాల్లో ప్రస్తావించారు. మరి ఎప్పుడు రుద్రాక్షను ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
రుద్రాక్షను ధరించి ఈ ప్రదేశాలకు వెళ్లకూడదు:- అంత్యక్రియలు, శవ ఊరేగింపు లేదా దహన సంస్కారాలు లాంటి కార్యక్రమాల్లో రుద్రాక్షను ధరించరాదని పురాణాల్లో చెప్పారు. ఈ కార్యాల్లో పాలుపంచుకునే ముందు రుద్రాక్షను తీసివేయండి. శివుడు జనన, మరణాలకు అతీతుడు. ఆయన భాగమైన రుద్రాక్షను జీవన, మరణాలకు సంబంధించిన ప్రదేశాల్లో ధరించరాదని నమ్ముతారు. ఇది రుద్రాక్షను నిష్క్రియను చేస్తుందని విశ్వసిస్తారు.
ఈ ప్రదేశంలో రుద్రాక్షను ధరించవద్దు:- రుద్రాక్షను ప్రసూతి గదిలో అంటే బిడ్డను జన్మనిచ్చిన గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఈ పరిమితి పిల్లల జట్కర్మ సంస్కారం పూర్తయిన తర్వాత ముగుస్తుంది. పుట్టుక, మరణం ఉన్న ప్రదేశాల్లో రుద్రాక్షను ధరించకూడదనే కారణం వల్లే ఈ నియమాన్ని పాటించాలి. కాబట్టి ప్రసూతి గదులు, బిడ్డలకు జన్మనిచ్చే ప్రదేశాల్లో రుద్రాక్షను ధరించకూడదు, ఉంచకూడదు.
పడుకునే ముందు రుద్రాక్షను తీసివేయండి:- నిద్రపోయే ముందు రుద్రాక్షను ఎల్లప్పుడూ తీసివేయాలని శాస్త్రాల్లో పొందుపరిచారు. ఈ సమయంలో శరీరం బలహీనంగా, అపవిత్రంగా ఉంటుందని నమ్ముతారు. అలాగే ఈ సమయాల్లో ఆచరణాత్మకంగా చూసినట్లయితే రుద్రాక్ష విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి నిద్రపోయే ముందు దాన్ని తీసివేయాలనే నియమం ఉంది. రుద్రాక్షను దిండు కింద ఉంచడం వల్ల అంతర్గత ప్రశాంతత లభిస్తుందని, చెడు కలలను నివారిస్తుందని విశ్వసిస్తారు.
మధు మాంసాహారం మానాలి :- రుద్రాక్షను ధరించిన వ్యక్తి మాంసాహారం లేదా మద్యం సేవించడం లాంటివి చేయకూడదు. ఇప్పటికీ మీరు రుద్రాక్షను ధరించాలనుకుంటే అది సరైందిగా పరిగణించబడదు. ఫలితంగా ప్రతికూల ప్రభావం కలుగుతుందని, భారీ నష్టం జరుగుతుందని నమ్ముతారు. కాబట్టి మొదటి ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని ఆపైన రుద్రాక్షను ధరించాలి. లేకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఈ స్థితిలో రుద్రాక్షను ధరించకూడదు:- శరీరం అపవిత్రమయ్యే కొన్ని కార్యకలాపాలు ఉంటాయి. వాటిలో ఒకటి శారీరక సంబంధాలు. కాబట్టి ఈ పనులు చేసే సమయాల్లో రుద్రాక్షను పొరపాటున కూడా ధరించకూడదు. ఇదే సమయంలో మహిళలు రుతుస్రావం సమయంలోనూ వీటిని ధరించడం నిషేధించడమైంది. కాబట్టి ఇలాంటి స్థితుల్లో మర్చిపోయి కూడా రుద్రాక్షను ధరించకండి. ఎంత శుచి శుభ్రతతో వ్యవహరిస్తే అంత మేలుచేస్తుంది.
రుద్రాక్షలను 108 గాని, 54 గాని, 27 గాని బంగారము, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారుచేయించి మెడలో ధరించవలెను. జప మాలగా కూడా ఉపయోగించవచ్చును.
వైద్యంలో రుద్రాక్షలు:- రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును.
రుద్రాక్ష ధరించుటకు మూల మంత్రం :- "ఓం, క్ష్రీం హ్రీం క్షాం వ్రీం ఓం' అనే మూల మంత్రాన్ని పదకొండుసార్లు పఠించి ఈ రుద్రాక్షను ధరించాలి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151