ప్రత్యక్ష నారాయణుడి రథసప్తమి

By telugu news teamFirst Published Feb 18, 2021, 1:03 PM IST
Highlights

స్నానానంతరం “సప్తసప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన, సప్తమీ సహితో దేవ గృహాణార్థ్యం నమోస్తుతే" అనే శ్లోకముతో సూర్యునకు అర్ఘ్యం ఇవ్వాలి.
 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుని గతి మారే శుభ సమయం ఫిబ్రవరి 19 శుక్రవారంనాడు. ఉత్తరాయణంలో మొదటిగా వచ్చే మహాపర్వం ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ కూడా రథాకారంగా ఉంటాయి. సర్వ దేవ మయుడైన ఆదిత్యుని సేవించడం వలన తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యాదులు ప్రాప్తిస్తాయి. స్నానం చేసేటపుడు సూర్యనారాయణుని ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్ర వచనం.

స్నానం చేసేటపుడు చదవాల్సిన శ్లోకాలు:-

“యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు, తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ

ఏతజ్జన్మకృతం పాపం యజ్ఞన్మాంతరార్జితం, మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః

ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే, సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమీ

స్నానానంతరం “సప్తసప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన, సప్తమీ సహితో దేవ గృహాణార్థ్యం నమోస్తుతే" అనే శ్లోకముతో సూర్యునకు అర్ఘ్యం ఇవ్వాలి.

సూర్యభగవానుని విధివిధానంగా ఆరాధించి గోమయంతో చేసిన పిడకలమంటతో వండిన పాయసాన్ని చిక్కుడాకులలో నివేదించాలి

“సూర్యగ్రహణ తుల్యా తు శుక్లా మాఘస్య సప్తమీ".

ఇది సూర్యగ్రహణంతో సమానమైన పవిత్ర సమయం కాబట్టి స్నాన, దాన, జపాలకు అత్యంత ముఖ్యమైనది.

దానం :- ఈ రోజున గుమ్మడికాయను దానం చేయడం మంచిది.

        

click me!